Shah Rukh Khan: హై ఎనర్జీతో యాక్టివ్‌గా మారిన షారుఖ్.. బాద్షా ఈజ్ బ్యాక్!

షారుఖ్ కొత్తగా అనిపిస్తున్నాడు.. సరికొత్తగా కనిపిస్తున్నాడు. కొడుకు డ్రగ్స్ న్యూసెన్స్ తో ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న బాలీవుడ్ బాద్షా.. మళ్లీ పాత పద్ధతికి వచ్చేశాడు. ఒడిదుడుకులన

Shah Rukh Khan: హై ఎనర్జీతో యాక్టివ్‌గా మారిన షారుఖ్.. బాద్షా ఈజ్ బ్యాక్!

Shah Rukh Khan: షారుఖ్ కొత్తగా అనిపిస్తున్నాడు.. సరికొత్తగా కనిపిస్తున్నాడు. కొడుకు డ్రగ్స్ న్యూసెన్స్ తో ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న బాలీవుడ్ బాద్షా.. మళ్లీ పాత పద్ధతికి వచ్చేశాడు. ఒడిదుడుకులను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డాడు. ఇప్పుడు నచ్చింది చేసేస్తున్నాడు. అందుకే బాద్షా ఈజ్ బ్యాక్ అంటూ పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Shah Rukh Khan: సొంత ఓటీటీతో ఎంట్రీ ఇస్తున్న షారుఖ్

గ్యాప్ వచ్చిందంతే.. ప్రెజెంట్ షారుఖ్ ఈజ్ బ్యాక్ అని పండుగ చేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. కొడుకు డ్రగ్స్ ఇష్యూ తర్వాత జనాల మధ్యకు రావడానికి ఇబ్బంది పడ్డ షారుఖ్.. ఇప్పుడు ఎప్పటిలాగానే అందరితో కలిసిపోతున్నాడు. సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా మారాడు. రీసెంట్ గా స్పెయిన్ లో పఠాన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన బాద్షా.. తమిళ్ డైరెక్టర్ అట్లీ మూవీతో బిజీగా మారాడు. పఠాన్ కోసం జుట్టు పెంచి 8 ప్యాక్ చూపించిన షారుఖ్.. రీసెంట్ గా స్కార్ఫ్ చుట్టుకుని అంబులెన్స్ ఎక్కుతున్న ఫోటో ఒకటి వైరలయింది. ఆ లుక్ అట్లీ మూవీలోనిదే అంటున్నారు. అటు ఈ మూవీ హీరోయిన్ నయనతార కూడా ముంబైలో కనిపించడంతో ఆ వార్తకు బూస్టప్ వచ్చింది.

Shah Rukh Khan: తొలగిన కష్టాలు.. మళ్ళీ జోష్‌లో షారుఖ్!

సినిమాల షూటింగ్స్ తోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కాస్త యాక్టివ్ గా షారుఖ్ కనిపిస్తున్నాడు. బీస్ట్ సినిమా ట్రైలర్ ను అట్లీతో కలిసి చూసి ఫిదా అయిన ఈ హీరో.. తాను దళపతి విజయ్ ఫ్యాన్స్ అంటూ హంగామా చేశాడు. అలాగే పఠాన్ అసిస్టెంట్ డైరెక్టర్ కి పర్సనల్ లెటర్ రాసి వహ్వా అనిపించుకున్నాడు. తన ఓన్ రైటింగ్ తో అసిస్టెంట్ డైరెక్టర్ పడిన కష్టాన్ని మెచ్చుకుంటూ షారుఖ్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

జనవరి 25, 2023లో థియేటర్స్ కి వస్తానంటూ రీసెంట్ గానే ప్రకటించాడు షారుఖ్ ఖాన్. సిద్ధార్ద్ ఆనంద్ తో పఠాన్.. అట్లీతో లయన్ తర్వాత.. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో తాప్సీ జోడీగా షారుఖ్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇలా గ్యాప్ వచ్చినా.. గ్యాప్ ఇచ్చినా వరుస సినిమాలు, సోషల్ మీడియా పోస్టులతో బాద్షా ఈజ్ బ్యాక్… హై ఎనర్జీతో కమ్ బ్యాక్ అనేలా చేస్తున్నాడు.