Shriya Dance: రెచ్చిపోయి చిందులేసిన శ్రియ.. రంగులే రంగులు
నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, బాలకృష్ణ వంటి అగ్ర నాయకుల సరసన నటించిన శ్రియ.. నటనతో పాటు డ్యాన్స్ లోనూ భళేగా..

Shriya Dance Video Goes Viral
Shriya Dance: నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, బాలకృష్ణ వంటి అగ్ర నాయకుల సరసన నటించిన శ్రియ.. నటనతో పాటు డ్యాన్స్ లోనూ భళేగా మెప్పిస్తారు. ఇష్టం సినిమాతో 2001లో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రియ అడపాదడపా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఎంటర్‌టైన్ చేసిన శ్రియా.. పెళ్లి తర్వాత సినిమాలు సెలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటోంది. రీసెంట్ గా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది.
హోలీ పండగను పురస్కరించుకుని జీవితాన్ని రంగులమయం చేసిన పెళ్లినాటి వీడియోను షేర్ చేసింది. ఇందులో శ్రియ భర్త ఆండ్రీ కొశ్చేవ్‌తో కలిసి ఫుల్ జోష్‌తో చిందులేస్తూ ఉన్న వీడియోను చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
పూనకమొచ్చినట్లుగా డ్యాన్స్ చేసి.. అందరి ముందే భర్తను కొంగుతో దగ్గరకు లాక్కుంటూ రొమాంటిక్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram