Siddharth – Aditi Rao Hydari : సీక్రెట్‌గా సిద్ధార్ద్, అదితి పెళ్లి జరిగిపోయిందా..?

సీక్రెట్‌గా సిద్ధార్ద్, అదితి పెళ్లి జరిగిపోయిందా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త..

Siddharth – Aditi Rao Hydari : సీక్రెట్‌గా సిద్ధార్ద్, అదితి పెళ్లి జరిగిపోయిందా..?

Siddharth Aditi Rao Hydari are married secretly news gone viral

Updated On : March 27, 2024 / 12:57 PM IST

Siddharth – Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ‘మహాసముద్రం’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరుగుతూ, డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూ వస్తున్నారు. కానీ ప్రేమ, పెళ్లి విషయం పై ఎటువంటి కామెంట్స్ ని చేయడం లేదు.

అయితే తాజాగా ఈ ఇద్దరు తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకు వెళ్లిరని సమాచారం. ఎవరికి తెలియకుండా వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో ఈరోజు ఉదయం సిద్ధార్ద్, అదితి సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లాంటివి ఏమి బయటకి రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది తెలియడం లేదు.

Also read : Game Changer : ఆ దేశ రాజధానిని.. ‘జరగండి’ సాంగ్ లొకేషన్‌గా మార్చేసిన శంకర్..

కాగా వీరిద్దరికి గతంలోనే పెళ్లి అయ్యింది. అయితే ఇద్దరు విడాకులు తీసుకోని విడిపోయారు. 2007లో విడాకులు తీసుకోని వివాహ బంధానికి ముగింపు పలికిన సిద్దార్థ్.. ఆ తరువాత పలువురు హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపారు. కానీ అవి పెళ్లి వరకు చేరుకోలేదు. ఇప్పుడు అదితితో ఉన్న ప్రేమ పెళ్లి వరకు చేరినట్లు తెలుస్తుంది. ఇక అదితి ఏమో 2012లో విడాకులతో తన మొదటి వివాహ బంధానికి ఎండ్ కార్డు వేశారు.