Sidharth-Kiara : మీడియాకి స్పెషల్ గిఫ్ట్ ఫ్యాక్స్ ఇచ్చిన కియారా-సిద్దార్థ్.. నేడే ముంబైలో భారీగా రిసెప్షన్..
సిద్దార్థ్-కియారా నేడు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. నేడు ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్ సిద్దార్థ్-కియారా రిసెప్షన్ రాత్రి 8 గంటల నుండి ప్రారంభమవనుంది. ఈ కార్యక్రమానికి................

Sidharth Malhotra and Kiara Advani distribute sweet packets to media persons in Mumbai
Sidharth-Kiara : బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్, లవ్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ ఇటీవలే గ్రాండ్ గా రాజస్థాన్ లో వివాహం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని, డేటింగ్ చేసి అనంతరం ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి చాలా తక్కువ మంది సెలబ్రిటీలు, ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది.
సిద్దార్థ్-కియారా నేడు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. నేడు ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్ సిద్దార్థ్-కియారా రిసెప్షన్ రాత్రి 8 గంటల నుండి ప్రారంభమవనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు జూహీ చావ్లా, అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా… మరింతమంది సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది.
Formula E Race : సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో హోరెత్తిన ఫార్ములా ఈ-రేస్..
శనివారం నాడు సిద్దార్థ్-కియారా ముంబైలోని తమ నివాసం నుండి బయటకు వచ్చి అక్కడ మీడియా, ఫోటోగ్రాఫర్స్ ఉండటంతో వారికి ఫొటోలకి ఫోజులిచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ఫోజులు ఇచ్చారు. అనంతరం అక్కడున్న మీడియా వాళ్లకి, ఫోటోగ్రాఫర్స్ కి గిఫ్ట్ ప్యాక్ చేసిన స్వీట్ బాక్సుల్ని పంచిపెట్టారు.
View this post on Instagram