Sitara Ghattamaneni : బాబోయ్ సితార పాప.. ఏంటి ఆ మాస్ డాన్స్.. మహేష్ బాబుని మించి..
తాజాగా డాన్సర్ ఫల్గుణి తో కలిసి ఓ మాస్ డాన్స్ వీడియో పోస్ట్ చేసింది సితార.

Sitara Ghattamaneni Shares a Mass Dance Video with Dancer Phalguni
Sitara Ghattamaneni : మహేష్ కూతురిగానే కాక సితార ఘట్టమనేని తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతుంది. ఇక సితార డాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సితార పలుమార్లు క్లాసిక్ డాన్స్, మహేష్ పాటలకు డాన్స్ లు చేసి వీడియోలు పోస్ట్ చేసింది.
Also Read : Rajamouli : దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓటు వేసిన రాజమౌళి.. మహేష్ సినిమా వర్క్‌తో బిజీగా ఉన్నా..
గతంలో యాని మాస్టర్, తన ఫ్రెండ్స్ తో కలిసి సితార పలు డాన్స్ వీడియోలు పోస్ట్ చేసింది. తాజాగా డాన్సర్ ఫల్గుణి తో కలిసి ఓ మాస్ డాన్స్ వీడియో పోస్ట్ చేసింది. ఓ హాలీవుడ్ సాంగ్ కి సితార, ఫల్గుణి కలిసి డాన్స్ చేశారు ఈ వీడియోలో. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సితార ఈ రేంజ్ మాస్ డాన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబుని మించి డాన్స్ చేస్తుందిగా అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. సితార మాస్ డాన్స్ వీడియోని మీరు కూడా చూసేయండి.