Tollywood Celebrities : విదేశాల్లో ఆస్తులు కొంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలు.. కొంతమంది పిల్లల్ని అక్కడే సెటిల్ చేస్తూ..

ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాల్లో ఆస్తులు కొనుక్కుంటున్నారు.

Tollywood Celebrities : విదేశాల్లో ఆస్తులు కొంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలు.. కొంతమంది పిల్లల్ని అక్కడే సెటిల్ చేస్తూ..

So Many Tollywood Celebrities buying Properties in Other Countries

Updated On : April 7, 2025 / 10:15 AM IST

Tollywood Celebrities : మన సెలబ్రిటీలు వాళ్లకు నచ్చినట్టు ఇక్కడ రోడ్ల మీద తిరగలేరు. షాపింగ్ చేయలేరు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు గ్యాప్ దొరికితే ఏదో ఒక దేశానికి వెళ్ళిపోతారు. స్టార్ సెలబ్రిటీలు అయితే షూటిగ్స్ గ్యాప్ ఉంటె వెకేషన్ కి వేరే దేశాలకు వెళ్ళిపోతారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలాంటి స్టార్స్ రెగ్యులర్ గా విదేశాలకు వెళ్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాల్లో ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఇల్లు, కమర్షియల్ ప్లేసెస్ కొని పెట్టుకుంటున్నారు. సెలబ్రిటీలు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి ఓ ఇల్లు కొని పెట్టుకుంటున్నారట. వీరిలో ప్రభాస్ అందరికంటే ముందు ఉన్నాడు.

మన సెలబ్రిటీల్లో అందరికంటే ముందు ప్రభాస్ విదేశాల్లో ఇల్లు కొన్నారట. ప్రభాస్ ఇటలీ దేశంలో ఓ విలేజ్ లో ఒక మంచి ఇల్లు కొని పెట్టుకున్నాడట. షూటింగ్స్ మధ్య గ్యాప్ వస్తే అక్కడికి వెళ్లి సేదతీరుతాడట ప్రభాస్. అలాగే లండన్ లో కూడా ప్రభాస్ ఒక ఇల్లు కొనుక్కున్నాడని సమాచారం.

Also Read : Niharika Konidela : ఫ్రెండ్స్ తో కలిసి భద్రాచలంలో నిహారిక.. శ్రీరామ నవమి స్పెషల్ ఫోటోలు వైరల్..

మహేష్ బాబు కూడా లండన్ లో ఓ ఇల్లు కొన్నారట. మహేష్ బాబు తనయుడు గౌతమ్ లండన్ లోనే చదువుతున్నాడు. మహేష్ కూడా ఎక్కువగా యూరప్ దేశాలకే వెకేషన్ కి వెళ్తాడు. అందుకే లండన్ లో ఇల్లు కొనుక్కున్నాడట.

త్రివిక్రమ్ కూడా లండన్ లో ఓ ఇల్లు కొన్నాడని టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ కొడుకు కూడా లండన్ లోనే సినిమా కోర్స్ చేస్తున్నాడట.

నిర్మాత ఆసియన్ సునీల్ ఫ్యామిలీ కూడా లండన్ లో ఇల్లు కొన్నట్టు తెలుస్తుంది.

ఇక మంచు విష్ణు అయితే దుబాయ్ లో ఇల్లు కొన్నట్టు సమాచారం. విష్ణు పిల్లలు దుబాయ్ లోనే చదువుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే దుబాయ్ లో కూడా విష్ణు ఓ స్కూల్ పెట్టాలనుకుంటున్నాడు. విష్ణు భార్య వెరోనికాకు లండన్ లో ఓ క్లాత్ బ్రాండింగ్ షాప్ కూడా ఉంది.

Also See : Deepika Rangaraju – Nani : ‘నాని’తో బ్రహ్మముడి సీరియల్ ‘దీపిక రంగరాజు’.. యాడ్ షూట్ లో.. క్యూట్ ఫోటోలు వైరల్..

పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా విదేశాల్లోనే చదువుతున్నారని సమాచారం.

చిరంజీవి కూతురు శ్రీజ కూడా త్వరలో దుబాయ్ కి షిఫ్ట్ అవుతుందని, అక్కడే పిల్లలతో సెటిల్ అవుతుందని, అక్కడ ఇల్లు కొనే ఆలోచనలో ఉందని సమాచారం.

ఇక తెలుగు సినిమాల్లో చేసిన కార్తీక నాయర్, రిచా గంగోపాధ్యాయ, లయ, అదితి అగర్వాల్, అన్షు.. ఇలా చాలా మంది హీరోయిన్స్ అయితే బిజినెస్ మెన్స్ ని పెళ్లి చేసుకొని అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లో సెటిల్ అయిపోయారు. అక్కడే సొంత ఇల్లు కొనుక్కొని ఉండిపోయారు.

మన సెలబ్రిటీలు ఎక్కువగా యూరప్ దేశాల్లో, దుబాయ్ లో ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు. అందుకే అక్కడే ఎక్కువగా ఆస్తులు కొంటున్నారు.