చనిపోయే ముందే విగ్రహం చేయించుకున్న ఎస్పీ బాలు

నలభై వేలకు పైగా పాటలు, పదహారు భారతీయ భాషల్లో అగ్ర హీరోలకు గాత్రదానం చేసిన గాన గందర్వుడు పద్మభూషణ్ సన్మానితులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ప్రతిభ, ఓర్పు, సహనం కలబోసుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తను పుట్టిన సొంత జిల్లా నెల్లూరు జిల్లాలోని వేద పాఠశాలలో ఇంతకు ముందు తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్టింపజేశారు.
అయితే తర్వాత తన తల్లి విగ్రహాన్ని, తన విగ్రహాన్ని తయారు చేయమని వడయార్‌కు బాలు ఆర్డరిచ్చారు. ప్రస్తుతం ఆ రెండు విగ్రహాలు తన వద్దనే ఉన్నాయని చెబుతూ.. రాజ్‌కుమార్ చెబుతున్నారు. బాలు విగ్రహం తయారు చేసిపెట్టమంటూ అభిమానుల నుంచి ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇదే విషయమై ఆస్పత్రిలో చేరేముందు ఆగస్టు 1న ఆయనకు వాయిస్ మెసేజ్ పంపారు బాలు.. ‘నమస్కారం రాజ్‌కుమార్‌గారూ.. మీరు పంపిన నా తల్లిగారు, నా బొమ్మలను చూశాను. చాలా బాగా వచ్చాయి. వాటిలో ఏ లోపాలు సరిదిద్దక్కర్లేదు. నా తల్లిగారిది నెల్లూరులోని వేద పాఠశాలలో పెట్టాలనుకుంటున్నాను. పంపించే ఏర్పాటు చేయండి..’ అంటూ సంగీత గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డీ రాజ్‌కుమార్ వడయార్‌కు వాయిస్ మెసేజ్ పంపారు.