Nayanthara : అర్ధరాత్రి రోడ్డుసైడ్ ఐస్‌క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. వీడియో వైరల్
అర్ధరాత్రి రోడ్డుసైడ్ ఐస్‌క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న నయనతార వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Star Actress Nayanthara enjoying ice cream in mid night at road side
Nayanthara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క తన పిల్లలు ఉయర్, ఉలగ్ లతో మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ఫ్యామిలీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.
తాజాగా నయనతార ఒక వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో నయన్ తో పాటు మరో ఇద్దరు కూడా కనిపించారు. వారు నయన్ స్నేహితులు లేదా కజిన్స్ అని తెలుస్తుంది. అర్ధరాత్రి రోడ్డు సైడ్ ఐస్ క్రీమ్ తింటూ లేట్ నైట్ ని ఎంజాయ్ చేస్తున్న వారికీ.. ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే నయనతార బ్యానర్ ఒకటి కనిపించింది. దీంతో మిగిలిన ఇద్దరు వ్యక్తులు.. నయనతారతో ఫన్నీ వీడియోని రికార్డు చేసారు.
Also read : Ranbir Kapoor : బాలీవుడ్ రామాయణం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు.. హాలీవుడ్ టాప్ సినిమాలకు మ్యూజిక్..
ఈ వీడియోని నయన్ భర్త విగ్నేష్ శివన్ రికార్డు చేసినట్లు తెలుస్తుంది. చూడడానికి ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
— Nayanthara✨ (@NayantharaU) April 4, 2024
ఇక నయన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసారు. అలాగే తెలుగులో మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం అయితే ఈ హీరోయిన్ సినిమాల విషయంలో కొంచెం వేగం తగ్గించినట్లు తెలుస్తుంది. అమ్మగా తన భాద్యతలను నిర్వర్తించడం కోసం ఎక్కువ సినిమాలకు సైన్ చేయకుండా, ఒక మూవీ పూర్తి అయిన తరువాత మరో మూవీకి సైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.