Anchor Suma : సుమ సినిమా వచ్చేస్తోంది..

ఇన్నాళ్లూ స్మాల్ స్క్రీన్ మీద ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన స్టార్ యాంకర్ సుమ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు..

Anchor Suma : సుమ సినిమా వచ్చేస్తోంది..

Suma

Updated On : November 3, 2021 / 6:14 PM IST

Anchor Suma: టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు వెళ్తుంటారు కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్.. చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారామె. ఆమె హోస్ట్ చేసే ప్రతి టీవీ షో సక్సెస్ అయ్యింది. ఇక సినిమా ఫంక్షన్లలో సుమలా ఎవరూ యాంకరింగ్ చెయ్యలేరు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ చివరి దీపావళి విషెస్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..

ఇప్పుడు సుమ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు నన్ను బుల్లితెర మీద ఆదరించినందుకు, మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. దేవుడి దయతో ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాను’ అంటూ పోస్టర్ షేర్ చేశారు సుమ.

NBK : దీపావళికి బాలయ్య డబుల్ ధమాకా

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నారు. పోస్టర్‌లో సుమ చేయి మీద వెంకన్న అనే పేరుతో ఉన్న పచ్చబోట్టు చూపించారు. నవంబర్ 6న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

Raviteja – Bellamkonda : ఒకేసారి రెండు బయోపిక్స్.. టైగర్ నాగేశ్వరరావు మీద ఎందుకింత క్రేజ్!

1996లో దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సుమ తర్వాత బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాలో అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ పాడి అలరించారు సుమ.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)