Doctor Yogi Dairies : పారానార్మాల్ డిటెక్టివ్ సినిమాగా ‘డాక్టర్ యోగి డైరీస్’.. సన్నీలియోన్ గెస్ట్ పాత్రలో..

పారా నార్మల్ డిటెక్టివ్ కథతో ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు 'డాక్టర్ యోగి డైరీస్' సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.

Doctor Yogi Dairies : పారానార్మాల్ డిటెక్టివ్ సినిమాగా ‘డాక్టర్ యోగి డైరీస్’.. సన్నీలియోన్ గెస్ట్ పాత్రలో..

sunny Leone new Movie in Telugu Doctor Yogi Dairies Opening Ceremony

Updated On : February 29, 2024 / 3:14 PM IST

Doctor Yogi Dairies : యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా సన్నీ లియోన్ ముఖ్య పాత్రలో కొత్త దర్శకులు రాజేష్ – ప్రసాద్ ద్వయం దర్శకత్వంలో అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై హర్షవర్ధన్, శ్రీదేవి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాక్టర్ యోగి డైరీస్’.

తాజాగా ఈ సినిమా ఫిలింనగర్ దేవస్థానం సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు వీర శంకర్, చంద్ర మహేష్, VN ఆదిత్య, గవిరెడ్డి శ్రీనివాస్.. పలువురు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా, VN ఆదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా చంద్ర మహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.

Also read : Rajamouli – Yash : బళ్లారి ఆలయంలో రాజమౌళి, యశ్.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో..

సినిమా నిర్మాతలు హర్షవర్ధన్, శ్రీదేవి మాట్లాడుతూ.. కొత్త కథతో పారా నార్మల్ డిటెక్టివ్ సినిమాతో రాబోతున్నాం. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశాం. ఈ సినిమాకి Rx 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పాటల రికార్డింగ్ కూడా ఆల్రెడీ అయింది. సన్నీ లియోన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతుంది. ఇప్పటికే కథ చెప్పగా ఓకే చెప్పింది అని తెలిపారు.

sunny Leone new Movie in Telugu Doctor Yogi Dairies Opening Ceremony

sunny Leone new Movie in Telugu Doctor Yogi Dairies Opening Ceremony