ఫ్లైట్ సిమ్యులేటర్ కొన్న సుశాంత్‌సింగ్

  • Published By: sekhar ,Published On : January 25, 2019 / 07:48 AM IST
ఫ్లైట్ సిమ్యులేటర్ కొన్న సుశాంత్‌సింగ్

Updated On : January 25, 2019 / 7:48 AM IST

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ తన బర్త్‌డేకి, తనకి తనే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చుకుని, బాలీవుడ్ జనాలనీ, సినీ అభిమానులనీ ఆశ్చర్యానికి గురిచేసాడు. జనరల్‌గా బర్త్‌డే అంటే ఏ ఖరీదైన వాచో, బంగారు ఆభరణాలు లాంటివో కొనుక్కుంటూ ఉంటారు. అందరిలా అవే కొంటే, తను సుశాంత్‌సింగ్ ఎలా అవుతాడు? అందుకే కాస్త వెరైటీగా ఆలోచించి, తనకి నచ్చిన ఖరీదైన బహుమతిని తనకి తానే ప్రెజెంట్ చేసుకున్నాడు. ఇంతకీ సుశాంత్ కొన్న ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ బర్త్‌డేకి తనకిష్టమైన ఫ్లైట్ సిమ్యులేటర్ కొనుక్కున్నాడు సుశాంత్‌సింగ్.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తనే తెలిపాడు. నా పుట్టినరోజు సందర్భంగా బోయింగ్ 737 ఫిక్స్‌డ్ బేస్ ఫ్లైట్ సిమ్యులేటర్ అనే అందాల రాశిని సొంతం చేసుకున్నా. 150 డ్రీమ్స్‌లో, నా ఫస్ట్ డ్రీమ్ నెరవేరింది అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీని ధర దాదాపు కోటి రూపాయలు. ఇంతకీ ఈ సిమ్యులేటర్ స్పెషాలీటీ ఏంటంటే, ఇది అచ్చం ఎయిర్‌క్రాఫ్ట్ కాక్‌పిట్‌లానే ఉంటుంది. కాబోయే పైలెట్స్‌కి దీనిపైనే ట్రైనింగ్ ఇస్తారు. ఇటీవల కేధార్‌నాథ్‌ మూవీతో ఆకట్టుకున్న సుశాంత్, ప్రసత్తం తన అప్‌కమింగ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.