మీ వల్లే కోలుకున్నా.. డాక్టర్స్‌కు థ్యాంక్స్ తెలిపిన తమన్నా..

  • Published By: sekhar ,Published On : October 17, 2020 / 06:11 PM IST
మీ వల్లే కోలుకున్నా.. డాక్టర్స్‌కు థ్యాంక్స్ తెలిపిన తమన్నా..

Updated On : October 17, 2020 / 6:23 PM IST

Tamannaah: మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన తమన్నాకు కోవిడ్‌ సోకింది. వెంటనే హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యింది తమన్నా.

కోవిడ్‌ నుండి బయటపడిన తర్వాత ముంబైలోని ఇంటికి చేరుకుంది. తను చాలా త్వరగా కోలుకున్నానని, అభిమానులు, కుటుంబ సభ్యులు కారణంగానే తాను త్వరగానే కోలుకున్నానని ఆమె తెలియజేశారు.


కాగా.. తాజాగా తనకు కోవిడ్‌ సమయంలో వైద్యం అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ పోస్ట్‌ చేసింది. కాంటినెంటల్‌ హాస్పిటల్‌లోని డాక్టర్స్‌, నర్సులు, స్టాఫ్‌కు మాటలతో థ్యాంక్స్‌ చెబితే సరిపోదు. నేను జ్వరంతో బలహీనమైపోవడం వల్ల భయపడ్డాను. కానీ మీరు మంచి మంచి వైద్యాన్ని అందించారు. మీ దయ, కేరింగ్‌తో నేను త్వరగా బయటపడ్డాను’’ అని పేర్కొంది తమన్నా.

డాక్టర్స్, నర్సులతో తీసుకున్న పిక్స్ షేర్ చేసింది తమన్నా. తెలుగులో గోపిచందన్ పక్కన ‘సీటీమార్’ సినిమాలో మహిళా కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది తమన్నా. నవంబర్ మొదటివారంలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.