RRR: ట్రైలర్ చూశాక తారక్-చెర్రీ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ విషయంలో మొదటి నుండి ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి సినిమాకు ప్రేక్షకులు, హీరోల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.
RRR: ఆర్ఆర్ఆర్ విషయంలో మొదటి నుండి ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి సినిమాకు ప్రేక్షకులు, హీరోల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఫ్యాన్స్ స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. అయితే.. ఆర్ఆర్ఆర్ విషయంలో స్టార్ హీరోలు కూడా ప్రేక్షకుల మాదిరి ఆరాటపడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా.. ట్రైలర్ ఎప్పుడొస్తుందా సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అంటూ సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే చాలామంది నుండి వినిపించింది.. కనిపించింది.
Samantha: కడపలో సామ్.. భారీగా ట్రాఫిక్ జామ్!
అయితే, చివరికి ఆర్ఆర్ఆర్ లో నటించిన హీరోలు, నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు యూనిట్ కి సైతం ఇదే ఆరాటం.. అదే ఉద్వేగం ఉందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఎంతగా ఫీలయ్యారో.. అందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం అంతకుమించి ఫీలయ్యారు. ట్రైలర్ చూసిన ఈ ఇద్దరూ దర్శకుడు రాజమౌళిని గట్టిగా హత్తుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రైలర్ చూడగానే చరణ్ రాజమౌళి హత్తుకొని పైకి లేపితే.. ఎన్టీఆర్ థాంక్యూ జక్కన్నా అంటూ ముద్దు పెట్టేశాడు.
Bigg Boss 5: ఫినాలేలో అడుగు పెట్టిన ఐదుగురు కంటెస్టెంట్లు వీళ్ళే!
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూశాక.. మా భీమ్-రామ్ రియాక్షన్ ఇది అంటూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వీడియోలో చరణ్, ఎన్టీఆర్ లతో పాటు రాజమౌళి నవ్వులు బాగా ఆకట్టుకున్నాయి. రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లు ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తీసుకురాబోతున్నాడు. అందుకే భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
Salman-Akshay: నువ్వా.. నేనా.. సల్మాన్, అక్షయ్ కలెక్షన్ల పోటీ!
Their reaction is priceless… ?
Our BHEEM & RAM reacting to #RRRMovie Trailer after watching it for the first time ❤️@ssrajamouli @tarak9999 @alwaysramcharan #RRRTrailer – https://t.co/I1AdSVDSX4 ? pic.twitter.com/0XEWrk1IIa
— RRR Movie (@RRRMovie) December 12, 2021