Raviteja: ఆ సీన్ రవితేజ కెరీర్‌లోనే స్పెషల్‌గా ఉండబోతుందట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఈ వారంలో రిలీజ్ కానుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా డ్యుయెల్ రోల్స్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Raviteja: ఆ సీన్ రవితేజ కెరీర్‌లోనే స్పెషల్‌గా ఉండబోతుందట!

This Scene Of Raviteja From Waltair Veerayya Will Be Special

Updated On : December 19, 2022 / 3:39 PM IST

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఈ వారంలో రిలీజ్ కానుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా డ్యుయెల్ రోల్స్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రాకకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు వస్తున్నారంటే?

కాగా, ఈ సినిమాతో పాటు రవితేజ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో ఇప్పటికే రిలీజ్ చేసిన రవితేజ వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాలో రవితేజకు సంబంధించిన ఓ సీన్ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ ఎంట్రీ ఇంటర్వెల్ సమయంలో ఉంటుందని.. ఈ సీక్వెన్స్‌ను హై వోల్టేజ్ యాక్షన్‌తో దర్శకుడు బాబీ తెరకెక్కించాడని తెలుస్తోంది.

Raviteja: మీరే చూస్తారు కదా.. అంటూ ‘ధమాకా’పై రవితేజ కాన్ఫిడెంట్!

ఇక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లోని ఫైట్స్ రవితేజ కెరీర్‌లోనే స్పెషల్‌గా ఉండబోతున్నాయట. ఆయన ఎంట్రీ సమయంలో చిరంజీవి-రవితేజల మధ్య వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌ను ఇస్తాయని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా, ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమాలో ఆ సీన్ ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.