Movie Updates : పూజా కార్యక్రమాలతో పట్టాలు ఎక్కిన కొత్త సినిమాలు..

దసరా సందర్భంగా హీరోలంతా తమ కొత్త సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, నాని, తమిళ్ హీరో విజయ్

Movie Updates : పూజా కార్యక్రమాలతో పట్టాలు ఎక్కిన కొత్త సినిమాలు..

Tollywood Kollywood new movie updates

Updated On : October 24, 2023 / 7:57 PM IST

Movie Updates : దసరా సందర్భంగా హీరోలంతా తమ కొత్త సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, నాని, తమిళ్ హీరో విజయ్ తమ కొత్త ప్రాజెక్ట్స్ ని పట్టాలు ఎక్కించారు. బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 157 సినిమా నేడు పూజ కార్యక్రమాలతో మొదలయింది. ఈ మూవీ సోషియో ఫాంటసీ డ్రామాతో తెరకెక్కబోతుంది.

నేచురల్ స్టార్ నాని తన 31వ సినిమా నిన్న అనౌన్స్ చేశాడు. ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో కలిసి నాని మరోసారి పని చేయబోతున్నాడు. ఈ సినిమాకి ‘సరిపోదా శనివారం’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. డివివి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రం కూడా నేడు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

Also read : Chiranjeevi : ఆ తమిళ స్టార్ డైరెక్టర్‌తో చిరు సినిమా.. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్..!

ఇక లియో సినిమాతో దసరా బ్లాక్ బస్టర్ ని అందుకున్న తమిళ్ హీరో విజయ్.. తన 68వ సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేశాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభుదేవా, లైలా, స్నేహ, యోగిబాబు వంటి స్టార్ క్యాస్ట్ ఈ మూవీ కోసం పని చేయబోతుంది.

అలాగే తెలుగు యువ హీరో తిరువీర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కబోయే చిత్రం కూడా నేడు మొదలయింది. ఈ సినిమాని వేణు ఉడుగుల డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దర్శకుడు గతంలో ‘నీది నాది ఒకటే కథ’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలను తెరకెక్కించి విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక నయనతార తాను నటిస్తున్న 75వ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది. నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ‘అన్నపూర్ణి’ అనే టైటిల్ ని పెట్టారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.