Varun Tej: తన హీరోయిన్‌ను ఇంట్రొడ్యూస్ చేయనున్న వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో 13వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో వార్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇవ్వనుంది.

Varun Tej: తన హీరోయిన్‌ను ఇంట్రొడ్యూస్ చేయనున్న వరుణ్ తేజ్..!

Varun Tej And Team To Introduce Heroine Of VT13 Tomorrow

Updated On : March 2, 2023 / 5:12 PM IST

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో 13వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో వార్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇవ్వనుంది.

Varun Tej : కొత్త మూవీ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్..

వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ సరికొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరా అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ విషయాన్ని రివీల్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎవరనే విషయాన్ని మార్చి 3న రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. రేపు ఉదయం 10.06 నిమిషాలకు ఈ చిత్ర హీరోయిన్ ఎవరనే విషయాన్ని రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Varun Tej: IAF డే సందర్భంగా వరుణ్ తేజ్ మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్!

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఎయిర్‌ఫోర్స్ పైలట్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్, రెనాయసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను ఈఏడాది చివరి నాటికి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.