అమ్మైనా.. నాన్నైనా.. నువ్వేలే ‘వెంకీమామ’

ఆకట్టుకుంటున్న ‘వెంకీమామ’ టైటిల్ సాంగ్..

  • Published By: sekhar ,Published On : November 7, 2019 / 11:53 AM IST
అమ్మైనా.. నాన్నైనా.. నువ్వేలే ‘వెంకీమామ’

Updated On : November 7, 2019 / 11:53 AM IST

ఆకట్టుకుంటున్న ‘వెంకీమామ’ టైటిల్ సాంగ్..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న సినిమా.. ‘వెంకీమామ’.. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్స్.. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా ‘వెంకీమామ’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు..

థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.. శ్రీ కృష్ణ అద్భుతంగా పాడాడు.. ‘మామా మామా మామా నే పలికిన తొలి పదమా.. నాకే దొరికిన వరమా.. నాకై నిలిచిన బలమా.. నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి.. నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి.. పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి.. నీ పేరై మోగింది గుండె సవ్వడి’..

‘అమ్మైనా, నాన్నైనా నువ్వేలే వెంకీమామా.. నా ధైర్యం, నా సైన్యం నువ్వేలే వెంకీమామా’ అంటూ సాగే ఈ పాట మామా అల్లుళ్ల బంధం గురించి చెప్పడంతో పాటు కాస్త గుండె బరువుతో పాటు ఇంకాస్త కంటి చెమ్మను కూడా కలిగిస్తుంది.. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాతలు : సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్.