‘వెంకీమామ’ : మామా అల్లుళ్ల లుక్ అదిరిందిగా!

దీపావళి సందర్భంగా, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన ‘వెంకీమామ’ పోస్టర్ ఆకట్టుకుంటుంది..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 11:33 AM IST
‘వెంకీమామ’ : మామా అల్లుళ్ల లుక్ అదిరిందిగా!

Updated On : October 26, 2019 / 11:33 AM IST

దీపావళి సందర్భంగా, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన ‘వెంకీమామ’ పోస్టర్ ఆకట్టుకుంటుంది..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న సినిమా.. ‘వెంకీమామ’.. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను.. కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీపావళి సందర్భంగా, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. వెంకీ, చైతు ఇద్దరూ గెడ్డంతో ఉన్నారు.. వెంకీ నార్మల్‌గా, చైతు మిలటరీ డ్రెస్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ‘వెంకీ రఫ్ లుక్, చైతు న్యూ లుక్.. కిరాక్’.. అంటున్నారు అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్..

Read Also : సూపర్ స్టార్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి కానుకగా మూవీ టీమ్ విడుదల చేసిన ఈ న్యూ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అయితే విడుదల తేదీ మాత్రం ప్రకటించ లేదు. ఈ సినిమాకు సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాతలు : సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్.