డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటోన్న విజయ్ సేతుపతి

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 07:40 AM IST
డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటోన్న విజయ్ సేతుపతి

Updated On : May 1, 2019 / 7:40 AM IST

తమిళ్ హీరోలంతా సినిమా సినిమాకి ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలపై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకోసం ఎంత కష్టమైనాసరే వెనక్కితగ్గడం లేదు. కోలివుడ్ హీరోలు పాత్రలో నటించమంటే ఏకంగా జీవించేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేయడంలో తమిళ హీరోలు ఎప్పుడూ ముందే ఉంటారు. లేటెస్ట్ గా రిలీజైన హీరో ధనుష్ మూవీ ‘అసురన్’ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసురన్ మూవీలో ధనుష్ లుక్ చూస్తే సినిమా ఊర మాస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెట్రిమారన్ డైరెక్షన్ లో అసురన్ తెరకెక్కుతోంది.     

మరో తమిళ్ హీరో మాధవన్ కూడా రాకెట్రీ సినిమా తో ప్రయోగం చేస్తున్నాడు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్ మహదేవన్ లైప్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. అందుకే అనంత నారాయణ్ లా కనిపించేందుకు ఏకంగా 14 గంటలు కుర్చీలో కూర్చుని మేకప్ వేసుకున్నాడు. అంతేకాదు అచ్చుగుద్దినట్లు ఆయనలా మారడానికి రెండేళ్లు కష్టపడ్డాడు.

ఇక తమిళ్ హీరోలందరిలో ఎక్కువగా ప్రయోగాలు చేసే హీరో విజయ్ సేతుపతి. క్యారెక్టర్ లో ఏదో ఒక వైవిధ్యం లేనిదే విజయ్ సేతుపతి నటించడానికి ఒప్పుకోడు. రీసెంట్ గా వచ్చిన సూపర్ డీలక్స్ సినిమాలో విజయ్ హిజ్రా పాత్రలో నటించి మెప్పించాడు. అంతకుముందు సీతాకాతి మూవీలో వయసైపోయిన ఆర్టిస్ట్ పాత్రలో నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం తెరకెక్కుతోన్న సింద్ బాద్ సినిమాలో కూడా వైవిద్యమైన పాత్రలో మెప్పించేందుకు సిద్దమవుతున్నాడు. ఇలా తమిళ్ హీరోలంతా ప్రయోగాలకి పెద్దపీట వేస్తున్నారు.