వెంకీ మామ వినాయక చవితి విషెస్

వినాయక చవితి పండుగ సందర్భంగా.. తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది వెంకీమామ టీమ్..

  • Published By: sekhar ,Published On : September 2, 2019 / 12:02 PM IST
వెంకీ మామ వినాయక చవితి విషెస్

Updated On : September 2, 2019 / 12:02 PM IST

వినాయక చవితి పండుగ సందర్భంగా.. తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది వెంకీమామ టీమ్..

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు.. విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళుగా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీమామ’.. కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతు పక్కన రాశీఖన్నా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇటీవల ప్రీ-టీజర్ పేరుతో.. ‘స్నీక్ పీక్  ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ మామా & అల్లుడు’ అంటూ వెంకీమామ మేకింగ్ వీడియో రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా వినాయక చవితి పండుగ సందర్భంగా న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

వెంకీ, చైతు తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టులో, ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని కనిపించారు. ఈ లుక్ అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. వెంకీమామ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.