Samantha : సమంత-జుకాల్కర్ మధ్య రిలేషన్ ఇదే..!
ఇటీవల సమంత, ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీశారు.

What Is The Relation Between Samantha And Preetham Jukalker
Samantha Ruth Prabhu : సమంత, నాగచైతన్య వీరిద్దరి జంట.. ఎందరికో ఆదర్శం.. ఈ ఇద్దరి జంట కనిపిస్తే చాలు.. చూడముచ్చట జంటగా చెప్పుకొనేవారు.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.. అక్టోబర్ 2వ తేదీన తమ దాంపత్య జీవితానికి వీడ్కోలు పలికారు. చైసామ్ విడిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చైసామ్ విడిపోవడానికి కారణాలు ఏంటో క్లారిటీ ఇవ్వలేదు. విడిపోతున్న విషయాన్ని ఇద్దరూ ప్రకటించినప్పటికీ.. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో మాత్రం రివీల్ చేయలేదు. దాంతో ఎవరికితోచినట్టు వారు ఏదో కథలు అల్లేసుకుంటున్నారు.
ఇటీవల సమంత, ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అసలు సమంతకు ఈయనతో ఎక్కడ పరిచయం ఆరా తీశారు అభిమానులు. చివరికి అతడు ఓ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్‌గా తెలిసింది. ప్రీతమ్ జుకల్కర్ పక్కా హైదరాబాదీ.. 33 ఏళ్లుంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్‌ని అతడి ప్రొఫెషనల్.. ఇండస్ట్రీలోనే కొందరు హీరోయిన్లకు స్టయిలీష్ గా పనిచేస్తున్నాడు. ఈవెంట్లకు, షోలకు వెళ్లినప్పుడు సమంతతో ఇతడికి పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి సమంతకు డిజైన్స్ ఇతడే తయారుచేసి ఇస్తున్నాడు. అలా ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది.
Radikaa Sarathkumar : రష్మికతో రాధిక సందడి.. వీడియో వైరల్..
దాంతో సోషల్ మీడియాలో ఈ జుకాల్కర్ కారణమంటూ రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఈ జుకాల్కర్, సమంతల మధ్య రిలేషన్ ఏంటో సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ క్లారిటీ ఇచ్చారు. సమంతను ప్రీమ్ జుకాల్కర్ అక్క అని పిలిచేవాడని వెల్లడించింది. తనకు ఈ రోజు షూట్ లేదని, దేవుడు తనకు తెలివిని ప్రసాదించడం వల్లే కొందరు తెలివిలేని వాళ్లకు ఈ ఫొటోను షేర్ చేయాలనుకుంటున్నానని ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది.
అంతకుముందు.. సమంత అతడినే రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అతడే ఇతడు.. సమంత పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్. చైశామ్ విడిపోవడానికి ముందు ఇతడు ఎవరో ఎవరికీ తెలియదు. గతంలో ఓసారి ప్రీతమ్ పుట్టిన రోజు అతడిపై కాళ్లు వేసుకుని ఫోటో దిగి హ్యాపీ బర్త్ డే చెప్పింది సమంత. దానికి ఐ లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు ప్రీతమ్.
అది పెద్ద రచ్చ అయింది. సమంత విడాకులు ప్రకటించిన కాసేపటికే ఓ పోస్ట్ పెట్టి జుకల్కర్ డిలీట్ చేశాడు. తమ మధ్య ఉన్నది అక్కా తమ్ముళ్ల బంధమే అంటూ అప్పట్లో ప్రీతమ్ పోస్టు కూడా పెట్టాడు. అయినప్పటికీ సమంత, నాగచైతన్యల మధ్య గొడవలకు ఒక వ్యక్తి కారణమంటూ అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకపారేస్తున్నారు. అతన్ని భారీగా ట్రోల్ చేస్తున్నారు. అతడి వల్లే చైసామ్ బ్రేకప్ అయ్యారని తిట్టిపోస్తున్నారు.
Samantha : ఆ విషయంలో సమంత నంబర్ 1.. విడాకులతో కలిసొచ్చిందా??