అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సాయిధరమ్ తేజ్..

లాక్‌డౌన్ టైమ్‌లో షూటింగులు లేక ఇంట్లో ఉన్న కుర్ర హీరోలు అందరూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ యూట్యూబ్ థంబునైల్ సోషల్ మీడియాలో పెట్టిన సాయిధరమ్ తేజ్.. వరుణ్ తేజ్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘ఏంటి బావా.. నీకు పెళ్లంటా?’ అంటూ ట్వీట్ చేశారు.
సాయి తేజ్ ట్వీట్‌పై స్పందించిన వరుణ్ తేజ్ .. ‘దానికి చాలా టైమ్ ఉందిలే కానీ, మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటాంరా అని చెప్పి సింపుల్‌గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు.’ అని సమాధానం ఇచ్చారు.
అయితే వరుణ్ తేజ్ ట్వీట్‌పై స్పందించిన నితిన్.. ‘బాధపడకండి బ్రో.. మీకు కూడా సమయం వస్తోంది. అవన్నీ కాదు కానీ అప్పుడెప్పుడో నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇస్తానన్నావ్ కదా సాయి, మరి నా గిఫ్ట్ ఎక్కడ? ఎప్పుడు ఇస్తావ్? నేను ఎదురుచూస్తున్నాను’ అని రిప్లై ఇచ్చారు.
కాగా, నితిన్ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడో నీ గిఫ్ట్ పంపేశా. సోమవారం నీ దగ్గరికి వస్తుంది. మా సింగిల్స్ తరఫున మీ మింగిల్స్ అందరికీ ఈ పాట అంకితం’ అని ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలోని ‘నో పెళ్లి’ అనే పాట విడుదల గురించి సాయితేజ్ తెలియజేశారు.
ఇదిలా ఉండగా సాయితేజ్ పెట్టిన ట్వీట్‌కి దర్శకుడు వెంకీ కుడుముల రిప్లై ఇచ్చారు. ‘‘సింగిల్ యాంథమ్’ అన్న కొన్నిరోజులకే నితిన్ ఎంగేజ్‌మెంట్ అన్నారు. మీరు కూడా ఇప్పుడు ‘నో పెళ్లి’ అంటున్నారంటే తర్వాత ఏం జరగనుందో నేను పసిగట్టగలను. అడ్వాన్స్‌గా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సాయితేజ్ బ్రో’ అని అన్నారు. దీనిపై నితిన్ స్పందిస్తూ.. ‘నిజమే.. నిజమే’ అని సరదాగా కామెంట్లు పెట్టారు.
#SinglesAnthem anna konni rojulake @actor_nithiin engaged annaru, ippudu meeru #NoPelli antunnarante next scene I pasigattified yaa..
Advance happy married life @IamSaiDharamTej bro ??? https://t.co/5UmxO0YLvN— Venky Kudumula (@VenkyKudumula) May 23, 2020