వంద మందికి ఒకటే టాయిలెట్.. లాక్‌డౌన్ కష్టాలు

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 10:14 AM IST
వంద మందికి ఒకటే టాయిలెట్.. లాక్‌డౌన్ కష్టాలు

Updated On : April 29, 2020 / 10:14 AM IST

కరోనా మహమ్మారి మొదలైన తర్వాత అరెసా బీబీ తన 18ఏళ్ల కజిన్ ను తీసుకుని ట్రీట్‌మెంట్ కోసం బయల్దేరింది. ట్రాన్స్‌పోర్ట్ కోసం రూ.1.5లక్షలు ఖర్చు చేసి అంబులెన్స్ ఎక్కింది. మూడు రాష్ట్రాలు దాటి బెంగాల్ సరిహద్దుకు చేరుకుంది. అంతదూరం వెళ్లినా బెంగాల్-ఒరిస్సా సరిహద్దు దగ్గరే వారు ఆగిపోవాల్సి వచ్చింది. 

బెంగాల్ ప్రభుత్వం ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలని ఎవ్వరినీ అనుమతించొద్దని ముందుగానే ఆంక్షలు విధించింది. వందల కొద్దీ జనం అక్కడే ఆగిపోయారు. టీనేజ్ అమ్మాయితో పాటు అరెసా బీబీ అక్కడే ఆగిపోయింది. కిడ్నీ పేషెంట్ అయిన బీబీ బెంగాల్ చేరుకునే ప్రయత్నం చివర వరకూ చేరకుండాపోయింది. 

తమిళనాడుకు నుంచి బెంగాల్ వెళ్లేందుకు ఇప్పటికే రూ.లక్ష ఖర్చు చేసేసింది. శుక్రవారానికి ఒడిశా బోర్డర్ వద్ద వందల కుటుంబాలు ఆగిపోయాయి. తిరిగి వెళ్లడానికి సాహసించలేక చెక్ పోస్టుల వద్ద సమస్య ఎందుకని అక్కడే ఆగిపోతున్నారు. జిల్లా పోలీసులు స్థానికంగా వసతి ఏర్పాటు చేశారు. ఈ సంక్షోభంలో ఏర్పాట్లు చేయలేక వందల మందికి ఒకటే టాయిలెట్ గత్యంతరంగా మారింది. 

మేము ఒకటిన్నర నెలలుగా వేల్లోర్ లోనే ఉంటున్నాం. ఇక్కడ చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. మేం హోటల్ నుంచి బయటకు వెళ్లడం లేదు. పర్సనల్ వెహికల్ ఒకటి అద్దెకు తీసుకున్నాం. రూ.70వేల నుంచి రూ.1.5లక్షలు ఖర్చు అయ్యాయి. మూడు రాష్ట్రాలు దాటి ఇక్కడకు వచ్చాం. ఎవ్వరూ ఆపలేదు. నా సొంత రాష్ట్రంలోనే నాకు అనుమతి దొరకడం లేదు. ఐదు రోజులుగా ఇక్కడే ఇరుక్కుపోయాం’ అని ఆ మహిళ చెప్పుకొచ్చింది. 

పోలీసుల మాకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఇక్కడ 3 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. దాదాపు 300మంది అవే వాడుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ 19తో పోరాడేదెలా.. అందరికీ ఒకటే కామన్ హాస్టల్. మాలో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే అందరికీ సోకకుండా ఉంటుందా. ఏ ఏర్పాట్లు లేకపోతే ఎలా. ఫుడ్ క్వాలిటీ అస్సలు లేదని బాధిత మహిళ వాపోయింది.