పెళ్లి జరిగిన 18 నెలలకే విడాకులు, భార్య రూ.12 కోట్ల భరణం, ఫ్లాట్ డిమాండ్ కేసు.. సుప్రీంకోర్టు తుది తీర్పు.. భరణం వచ్చిందా?
"చదువుకుని, పనిచేసే సామర్థ్యం ఉన్నవారు సోమరిగా ఉంటూ భరణం కోసం ఎదురుచూడటం సరికాదు. ప్రతి ఒక్కరూ స్వావలంబనతో జీవించాలి" అని జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈ తీర్పు భరణం కేసులలో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.

పెళ్లి జరిగిన 18 నెలలకే విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు ఆ దంపతులు. భరణంగా తనకు రూ.12 కోట్లు, ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ఇప్పించాలని కోరింది భార్య. ఈ వార్త ఇటీవల దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు నేటితో ముగిసింది.
భర్త నుంచి కళ్లు చెదిరే భరణాన్ని డిమాండ్ చేసిన భార్యకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 5న ఆ జంట వివాహ బంధానికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
విచారణ సమయంలో భార్య డిమాండ్లపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వివాహం కేవలం 18 నెలలు మాత్రమే కొనసాగిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఎంబీఏ చదివి, ఐటీ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న భార్య ఎందుకు మళ్లీ ఉద్యోగంలో చేరడం లేదని ప్రశ్నించింది. “మీరు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం చేయగలరు కదా? ఎందుకు ప్రయత్నించడం లేదు?” అని CJI ఇటీవల ప్రశ్నించారు.
మహిళ తరఫు న్యాయవాది ఆమెకు నెలకు కోటి రూపాయలు కావాలని వాదించగా, “18 నెలల వివాహానికే నెలకు కోటి రూపాయలు కావాలా?” అని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, “మీ మామగారి (భర్త తండ్రి) ఆస్తులపై మీకు ఎలాంటి హక్కు లేదు” అని కూడా ధర్మాసనం భార్యకు స్పష్టం చేసింది.
Also Read: సృష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. పిల్లల్ని అమ్మే గ్యాంగులతో నమ్రతకు లింకులు..
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
అన్ని వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు భార్యకు రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. అవి..
భర్త పేరు మీద ఉన్న ఫ్లాట్‌ను పూర్తి హక్కులతో ఆమె పేరు మీద బదిలీ చేసుకోవడం లేదా ఒకేసారి భరణంగా రూ.4 కోట్లు తీసుకోవడం.
చివరకు, తుది తీర్పులో భర్త సదరు ఫ్లాట్‌ను భార్య పేరు మీద వెంటనే రిజిస్టర్ చేయాలని కోర్టు ఆదేశించింది.
“చదువుకుని, పనిచేసే సామర్థ్యం ఉన్నవారు సోమరిగా ఉంటూ భరణం కోసం ఎదురుచూడటం సరికాదు. ప్రతి ఒక్కరూ స్వావలంబనతో జీవించాలి” అని జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈ తీర్పు భరణం కేసులలో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.