CAAపై మన్మోహన్ వ్యాఖ్యలు…వీడియో బయటపెట్టిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : December 19, 2019 / 10:41 AM IST
CAAపై మన్మోహన్ వ్యాఖ్యలు…వీడియో బయటపెట్టిన బీజేపీ

Updated On : December 19, 2019 / 10:41 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్,తృణముల్,సీపీఐ(ఎం)వంటి పలు పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పలుచోట్ల ఆయా పార్టీ నాయకులు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-19,2019)బీజేపీ కాంగ్రెస్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

2003లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో మాట్లాడిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఆ వీడియోలో మన్మోహన్ సింగ్…పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్ దేశాల‌్లోని మైనార్టీలు వేధింపులను ఎదుర్కొంటున్నారని, వాళ్లు భారత పౌరసత్వం కోరుకుంటున్నారని, వారికి పౌర‌స‌త్వం కల్పించే అంశాన్నిపరిశీలించాలని అప్పటి ఉప ప్రధాని ఎల్ కే అద్వాణీని రాజ్యసభలో మన్మోహన్ కోరారు.

ఈ వీడియోను గురువారం బీజేపీ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. మూడు దేశాల మైనార్టీల ప‌ట్ల ఔదార్యంతో వ్య‌హ‌రించాల‌ని మ‌న్మోహ‌న్ రాజ్య‌స‌భ‌లో కోరిన ఆ వీడియోపై ఇంకా కాంగ్రెస్ పార్టీ స్పందించ‌లేదు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌లు చేప‌డుతున్న నేప‌థ్యంలో బీజేపీ ఇప్పుడు మ‌న్మోహ‌న్ పాత వీడియోను పోస్టు చేసింది.