52 ఏళ్ల రాజకీయ ఘన చరిత్ర : కాలినడకనే ఎన్నికల ప్రచారం

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 07:04 AM IST
52 ఏళ్ల రాజకీయ ఘన చరిత్ర : కాలినడకనే ఎన్నికల ప్రచారం

మురాదాబాద్ : ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంటే లక్షలకు లక్షలకు ఖర్చు పెడుతు.. ఎన్నికల కోసం ప్రత్యేక వాహనాలను కూడా తయారు చేయించుకుని మరీ ప్రచారం చేస్తున్నారు నాయకులు. కానీ కొందరు మాత్రం తాము నమ్మిన సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ఈనాటి హడావిడి ప్రచారాలలో కూడా కాలి నడకనే ప్రచారం చేసేవారు బహు అరుదుగా కనిపిస్తుంటారు. అటువంటి అరుదైన వ్యక్తి యూపీలోని దీపాసరాయ్ నివాసి డాక్టర్ షఫీఖర్ రహ్మాన్ బుర్కే. 52 సంవత్సరాల క్రితం రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ షఫీఖర్ రహ్మాన్ బుర్కే నాలుగుసార్లు ఎమ్మెల్యే..నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. కానీ ఏనాడు హై టెక్ ప్రచారం జోలికి పోలేదు. కానీ వయోభారం వల్లన ఇప్పుడు మాత్రం ఆయన ఎన్నికల ప్రచారం కోసం స్నేహితుని జీపును వినియోగిస్తున్నారు. 
 

డాక్టర్ బర్క్ తొలిసారిగా 1967లో రాజ్‌గోపాల్ నుంచి ఇండిపెడెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. తరువాత 1969 లో కూడా ఓడిపోయారు. 1974లో భారతీయ కిసాన్ వికాస్‌దళ్ నుంచి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో లోక్‌దళ్, 1989లో జనతాదళ్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996, 1998లో మురాదాబాద్ ఎంపీగా వ్యవహరించారు. ఎన్నికల సందర్భంలో కాలినడకనే ఇంటింటికీ వెళ్లి ప్రచారం సాగించేవారు. ప్రస్తుతం బిలారీ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేస్తు..తనకు టిక్కెట్ లభించిందని తెలియగానే డాక్టర్ బుర్కే అభిమానులు ఒకరికి ఒకరు స్వీట్స్ పంచిపెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన తన స్నేహితుని దగ్గర నుంచి జీపు తీసుకుని దానిలో ప్రచారం సాగిస్తున్నారు షఫీఖర్ రహ్మాన్ బుర్కే.