నువ్వు తోపు తాత.. 70 ఏళ్ల వయసులో ఇంటర్నెట్ సంచలనంగా మారిన వృద్ధుడు.. ఏం చేశాడంటే?
ఆయన నిజాయితీ, నిర్మలత్వం చూసి నెటిజన్లు ఈ వీడియోను బాగా షేర్ చేస్తున్నారు.
70 year old UP ‘uncle’ (Pic: Insta)
- ఇన్‌స్టా అంకుల్ పేరిట అకౌంట్ ఓపెన్
- తాను ఎప్పుడూ వ్లాగ్ చేయలేదన్న తాత
- టైమ్‌పాస్‌కు కొత్తది ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్య
Video: సోషల్ మీడియాలో యువత చేసే పోస్టులు మాత్రమే వైరల్ అవుతుంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే, ఓ తాత అది రాంగ్ అని నిరూపించాడు. 70 ఏళ్ల వయసులో ఆయన చేసిన పోస్టుకు 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఆయన ఇంటర్నెట్ సంచలనంగా మారాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ అనే వృద్ధుడు ఇన్‌స్టా అంకుల్ పేరిట అకౌంట్ ఓపెన్ చేసి అందరి హృదయాలను తాకేలా మాట్లాడుతూ ఈ పోస్ట్ చేశాడు. తాను ఎప్పుడూ వ్లాగ్ చేయలేదని, సమయం గడపడానికి కొత్తది ప్రయత్నించాలని అనుకుంటున్నానని అన్నాడు.
Also Read: మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్.. కాల్పుల కలకలం
వీడియో ప్రారంభంలో ఆయన “70 సాల్ కి ఉమర్ మే అప్నా పహ్లా వ్లాగ్ బనా రహా హూన్” అని చెబుతాడు. తనకు వ్లాగ్ చేయడం తెలియదని, అయినా అర్థవంతంగా సమయం గడపాలనే ఆలోచనతో ప్రయత్నిస్తున్నానని వివరిస్తాడు.
“ముఝే వ్లాగ్ బనానా నహీ ఆతా పర్ మై కోశిష్ కర్ రహా హూన్” అని అంటాడు. ఆయన నిజాయితీ, నిర్మలత్వం చూసి నెటిజన్లు ఈ వీడియోను బాగా షేర్ చేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తాతముత్తాతలు గుర్తుకొచ్చారని చాలా మంది కామెంట్లు చేశారు.
ఒకరు కామెంట్ చేస్తూ “ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంకుల్” అని పేర్కొన్నారు. మరొకరు “లగే రహో అంకుల్ హమ్ ఆప్‌కే సాథ్ హై” అని రాశారు.
ఆ తాత ఈ వీడియోను జనవరి 20న పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి 23 మిలియన్ వ్యూస్, 1.7 మిలియన్ లైక్స్ వచ్చాయి. వీడియో రూపంలో వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలను ఆ తాత పంచుకున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది.
View this post on Instagram
