భారత్‌లో మరో 9 కరోనా కొత్త కేసులు..

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారత్ లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 08:34 AM IST
భారత్‌లో మరో 9 కరోనా కొత్త కేసులు..

Updated On : March 10, 2020 / 8:34 AM IST

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారత్ లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదు అయ్యాయి.

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారత్ లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 6, బెంగళూరులో కరోనా 3 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 56 కు చేరాయి.

కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి ఇటీవలే ఇటలీ వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌కు చెందిన ఓ మహిళకూ కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఆ మహిళ ఇటీవల ఇరాన్‌ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలతో పాటు ఎప్పటికప్పుడు ఆయా భాషల్లో తగిన సూచనలు ఇస్తున్నామని చెప్పారు.(నెల్లూరులో కరోనా అనుమానిత కేసు)

కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4వేల 26కు పెరిగింది. లక్షా పదివేల మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచదేశాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృభించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్‌ నుంచి బయలుదేరారు. తెహ్రాన్ నుంచి భారత వాయుసేన సీయూ విమానంలో ఘజియాబాద్‌ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌ ప్రభుత్వానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.