చీపురు ఊడ్చేసింది.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ హవా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. సింహంలా దుసుకొచ్చాడు. మాటలతో కోటలు కట్టడం కాదు. అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్లాడు. మళ్లీ పదవిలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పారు. పని చేసే నాయకుడికి పట్టం కడితే మీ తలరాత మారుస్తా అనడం అందర్నీ ఆకట్టుకొంది.
కేజ్రీవాల్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీల వర్షం కురిపించారు. 28 పాయింట్ ల గ్యారెంటీ కార్డు రిలీవ్ చేశారు. నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాటశాలలో దేశ భక్తి పాఠ్యాంశాలు, స్వచ్చమైన తాగునీరు, నిరంతర విద్యుత్, రేషన్ సరుకులు డోర్ డెలివరీ, పది లక్షల మంది వృద్ధులను తీర్థ యాత్ర, పారిశుధ్య కార్మికులు విది నిర్వహణలో చనిపోతే కోటి రూపాయల పరిహారం, స్పోకెన్ ఇంగ్లీష్, జన్ లోక్పాల్ బిల్లుకు ప్రయత్నం వంటి పలు హామీలు ఇచ్చారు. కేజ్రీవాల్ హామీలకు ఢిల్లీ వాసులు ఫిదా అయ్యారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. 70 స్థానాలున్న ఢిల్లీలో ఆప్ ప్రస్తుతం 57స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 13స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కస్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. విజయం ఖాయమవడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ మొదటి నుంచి లీడ్‌లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దుమ్మురేపింది. న్యూఢిల్లీ పరిధిలోని 10 స్థానాల్లో ఆప్ దూకుడు కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ అధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 40 శాతానికి పైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 4శాతం ఓట్లు సాధించింది. ఢిల్లీ కంటోన్మెంట్, ద్వారాకా, జనక్ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఈస్ట్, నార్త్‌వెస్ట్ ఢిల్లీలో బీజేపీ పాగా వేసింది.
అయితే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి మాత్రం పరాభవం ఎదురైంది. ఆప్‌కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్ లీడ్‌లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్‌పాల్ సింగ్ ఆప్ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం సిసోడియా వెనుకంజలో ఉన్నారు. 1400కు పైగా సిసోడియా ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
ఆప్ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో బీజేపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం బోసిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం మీడియాకు దూరంగా ఉన్నారు.