Delhi : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై దాడి చేసిన కాకి.. ఎగతాళి చేస్తూ బీజేపీ ట్వీట్లు
పార్లమెంటు సమావేశాలకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసింది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేసింది. మరోవైపు మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Delhi
Delhi : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు బయట ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆయనపై ఓ కాకి దాడి చేసినట్లు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేయడం వైరల్‌గా మారింది.
Opposition Meet: కాంగ్రెస్ చేసిన ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆప్.. అందుకు ఓకే అంటూ ప్రకటన
ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు వెలుపల కనిపించారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఓ కాకి ఆయనపై దాడి చేసింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇదే అదనుగా బీజేపీ నేతలు ఆయనను ఎగతాళి చేస్తూ ట్వీట్లు పెట్టారు. BJP Delhi ట్విట్టర్ ఖాతాలో ‘ఝూట్ బోలే కవ్వా కాటే’.. అని ఈరోజు వరకూ విన్నాను.. ఈరోజు నేను అబద్ధాల కోరును కాకి కరిచినట్లు చూసాను’ శీర్షికతో షేర్ చేశారు.
Karnataka Politics: నాలుగు రోజుల్లోనే యూటర్న్ తీసుకున్న జేడీఎస్.. బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటన
‘గౌరవ ఎంపీ గారు.. మీపై కాకులు దాడి చేశాయన్న వార్తతో గుండె చాలా బాధగా ఉంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా కూడా రాఘవ్ చద్దాను ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించడంతో ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసును సమర్పించగా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నాగేశ్వరరావు స్పీకర్‌కు ప్రత్యేక నోటీసును పంపారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసపై ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రకటన ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
झूठ बोले कौवा काटे ?
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023
माननीय सांसद @raghav_chadha जी पे कौवे द्वारा हमले की खबर से ह्रदय बहुत व्यथित हैं । आशा हैं आप स्वस्थ होंगे । pic.twitter.com/o3Iy4HABFs
— Tejinder Pall Singh Bagga (@TajinderBagga) July 26, 2023