పెళ్లికి ఒప్పుకోలేదని.. యాక్టర్‌ను 3సార్లు కత్తితో పొడిచాడు

TV actor Malvi Malhotraపై కత్తితో దాడి జరిపాడు. పెళ్లికి ప్రపోజల్ పెట్టిన వ్యక్తికి మాల్వి నో చెప్పిందని మూడు సార్లు కడుపులో చేతులపై పొడిచాడు. సోమవారం రాత్రి ఘటన జరిగిన కాసేపటికే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్పారు.
లగ్జరీ కారులో వచ్చిన వ్యక్తి.. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అతడ్ని యోగేశ్ కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తిగా గుర్తించారు. యాక్టర్ స్టేట్‌మెంట్ ఆధారంగా.. ఆమెకు సింగ్ అనే వ్యక్తి సంవత్సరం నుంచి తెలుసు. వాళ్లు స్నేహితులు కూడా.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో్ ఆమె సడన్ గా మాట్లాడటం మానేసింది.
సోమవారం రాత్రి ఓ కేఫ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. నార్త్ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆడి కారులో వచ్చిన వ్యక్తి ఆమెను అడ్డుకుని ప్రశ్నించాడు. నాకు నీతో మాట్లాడాలని లేదు. నన్ను ఫాలో అవ్వకు. ఎందుకు నన్ను వేధిస్తున్నావని ప్రశ్నించింది.
ఆ మాటలకు కోపంతో యాక్టర్ ను కత్తితో పొడిచాడు. వెర్సోవా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కేసు ఫైల్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదైంది. నిందితుడ్ని విచారిస్తున్నాం. అని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.