Au : ఏయులో మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ లలో ప్రవేశం
ఇది ఆన్‌లైన్ ప్రోగ్రామ్. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేషనల్ స్కిల్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ సహకారం అందిస్తుంది.

Andhra University
Au : విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో బీబీఏతో కలిపి ఎంబీఏ, బీబీఏ, ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులన్నీ సెల్ఫ్ సపోర్టెడ్ ప్రోగ్రామ్‌లు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
బీబీఏ + ఎంబీఏ
ఇది అయిదేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంవీ) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఇందులో మల్టిపుల్ ఎంట్రీ – ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. మొత్తం 30 సీట్లు ఉన్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో లాస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు ఫీజు రిఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు లభించవు. కోర్సు ఫీజు వివరాలకు సంబంధించి మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.1,50,000; చివరి రెండేళ్లు ఏడాదికి రూ.2,00,000. ఏటా పరీక్ష ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
బీబీఏ లాజిస్టిక్స్
కోర్సు వ్యవధి మూడేళ్లు. నేషనల్ స్కిల్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నారు. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.9,000 చెల్లిస్తారు. నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్ పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఏదేని గ్రూప్‌తో ఇంటర్,పన్నెండోతరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు: రూ.85,000
ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్
ఇది ఆన్‌లైన్ ప్రోగ్రామ్. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేషనల్ స్కిల్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ సహకారం అందిస్తుంది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సాయుధ దళాల్లో పనిచేస్తున్నవారికి, వారి పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. కోర్సు ఫీజు: రూ.60,000
దరఖాస్తు ఫీజు: రూ.1200,దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ఫీజు: రూ.500 అభ్యర్ధులు నవంబరు 20 తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సీట్ల అలాట్‌మెంట్, కోర్సు ఫీజు చెలింపులను నవంబరు 22తేది నాటికి పూర్తి చేయాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి నిర్దేశిత పత్రాలు జతచేసి యూనివర్సిటీ చిరునామాకు పంపాలి. పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెద వాల్తేర్, విశాఖపట్నం – 530017. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.audoa.in