Lok Sabha polls-2024: ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదు: అమిత్ షా

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకుడైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

Lok Sabha polls-2024: ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదు: అమిత్ షా

Amit Shah says no one is trying to remove the legacy

Updated On : February 20, 2023 / 7:57 PM IST

Lok Sabha polls-2024: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకుడైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాయని అమిత్ షా అన్నారు. నాగాలాండ్ లో శాంతికి కృషి చేస్తామని తెలిపారు. శాంతి కోసం విజయవంతంగా చర్చలు జరపడమే తమ లక్ష్యమని చెప్పారు. నాగా రాజకీయ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు.

అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు. కాగా, 60 సీట్లు ఉండే నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మేఘాలయాలో కూడా అదే రోజున ఎన్నికలు జరుగుతాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు నిర్వహిస్తారు. త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెల్లడవుతాయి.

Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్‌పై దాడి, కారుకి నిప్పు