Air India Flight : 129 మందితో కాబూల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఫ్లైట్

అఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబ‌న్‌ల ఆధీనంలోకి వెళ్లిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆ దేశంలోని భారతీయులను సురక్షిదంగా స్వదేశానికీ తీసుకొస్తోంది భారత ప్రభుత్వ

Air India Flight : 129 మందితో కాబూల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఫ్లైట్

Air India

Updated On : August 15, 2021 / 7:57 PM IST

Air India Flight అఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబ‌న్‌ల ఆధీనంలోకి వెళ్లిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆ దేశంలోని భారతీయులను సురక్షిదంగా స్వదేశానికి సేఫ్ గా తీసుకొస్తోంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఓ ఎయిరిండియాకి చెందిన AI-244 విమానం ఇవాళ కాబూల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లింది. ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేప‌టి క్రితం 129 మంది ప్ర‌యాణికుల‌తో కాబూల్ నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరింది. ఆదివారం సాయంత్రం 6.06 గంట‌ల‌కు విమానం కాబూల్ విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ అయ్యింద‌ని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రికి విమానం ఢిల్లీకి చేరుకోనున్నట్లు తెలిపారు.

ALSO READ: Afghanistan: తాలిబన్లకు లొంగిపోయిన అఫ్ఘాన్ సర్కార్..అధ్యక్షుడు రాజీనామా

కాగా, ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి కాబూల్ వెళ్ళిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబూల్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ విమానం సుమారు గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టవలసి వచ్చింది. ఓ దశలో పైలట్ విమానం రాడార్‌ను స్విచాఫ్ చేశారు. ఈ విమానాన్ని శత్రువులు గుర్తించి, టార్గెట్ చేస్తారేమోననే ఉద్దేశంతో రాడార్‌ను స్విచాఫ్ చేశారు. ఉద్విగ్న వాతావరణంలో ఓ గంట ఆలస్యంగా ఎట్టకేలకు ఈ విమానం ల్యాండ్ అయింది.

READ Indians In Afghanistan : తిరిగొచ్చేయండి.. అఫ్ఘానిస్తాన్ లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానం

REAd Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా

READ Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!