Indians In Afghanistan : తిరిగొచ్చేయండి.. అఫ్ఘానిస్తాన్ లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానం
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆప్గనిస్తాన్ ని మళ్లీ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

Afganistan
Indians In Afghanistan నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆప్గనిస్తాన్ ని మళ్లీ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్లో ప్రభుత్వ దళాలు-తాలిబన్ల మధ్య పోరు తీవ్రతరంగా మారిన నేపథ్యంలో ఆ దేశంలోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక విమానాన్ని భారత్ ఏర్పాటు చేసింది.
మంగళవారం సాయంత్రం ఆఫ్గనిస్తాన్ లోని నాల్గవ అతిపెద్ద నగరమైన మజారె షరీఫ్ నుంచి ఈ ప్రత్యేక విమానం ఢిల్లీకి బయలుదేరనుంది. మజారె షరీఫ్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారతీయులు ఈ విమానం ఎక్కి స్వదేశానికి తిరిగొచ్చేయ్యాలని మజారె షరీఫ్ లోని ఇండియన్ కాన్సులేట్ కోరింది. ఈ ఫ్లైట్కు వచ్చే వాళ్లు వెంటనే పూర్తి పేరు, పాస్పోర్ట్ వివరాలు వెంటనే పంపించాలని వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చింది. కాగా,ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం 1500మంది భారతీయులు ఆఫ్గనిస్తాన్ లో నివసిస్తున్నారు. కాగా,దేశంలోని నాలుగో పెద్ద నగరమైన మజారె షరీఫ్ తమ తర్వాతి లక్ష్యమని గతవారం తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Kandahar Consulate : తాలిబన్ ఎఫెక్ట్..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కాందహార్ కాన్సులేట్ సిబ్బంది