Afghanistan: తాలిబన్లకు లొంగిపోయిన అఫ్ఘాన్ సర్కార్..అధ్యక్షుడు రాజీనామా

అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది.

Afghanistan: తాలిబన్లకు లొంగిపోయిన అఫ్ఘాన్ సర్కార్..అధ్యక్షుడు రాజీనామా

Ashraf (1)

Afghanistan అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. ఇప్పటికే దేశంలోని దాదాపు ముఖ్యమైన అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్ లోకి ప్రవేశించారు. దీంతో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాలిబన్లకు అధికారం అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

తాలిబన్ల నేతృత్వంలో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడనుందని,తాలిబన్ నాయకుడు ముల్లా బరాదర్.. ఖతార్(ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య చర్యలకు మధ్యవర్తిగా ఉన్న దేశం) సహాయంతో మరియు అమెరికా ఆమోదంతో ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

అయితే అష్రఫ్ ఘనీ భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అఫ్రష్ ఘనీని బహిరంగంగా ఉరితీస్తామని గతంలో తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్రష్ ఘనీని తాలిబన్లు ఏం చేయనున్నారనేది కీలకంగా మారింది. మరోవైపు,దేశం వదిలి పారిపోయే ప్రయత్నాలను కూడా అష్రఫ్ ఘనీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

READ Afghanistan crisis: కాబూల్‌లో తాలిబన్ల జెండా.. రాజధానిలో ప్రవేశించిన తీవ్రవాదులు