Air India: ఎయిరిండియా కీలక ప్రకటన.. మే 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేత..
మే 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.

Air India: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేసింది. దేశంలోని పలు నగరాలకు మే 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది. జమ్ము, శ్రీనగర్, లేహ్, జోధ్ పూర్, అమృత్ సర్, చండీఘడ్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది ఎయిరిండియా.
ఈ కాలంలో ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్న కస్టమర్లకు రీషెడ్యూలింగ్ ఛార్జీలపై ఒకేసారి మినహాయింపు లేదా రద్దులకు పూర్తి వాపసు అందించబడుతుంది. మరిన్ని వివరాల కోసం, 011-69329333 / 011-69329999 నంబర్లలో కాల్ చేయగలరని తెలిపింది.
విమాన ప్రయాణంపై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా, ఇండిగూన్ కీలక ప్రకటన చేశాయి. కొన్ని విమానాశ్రయాలకు తమ విమానాలు మే 15 వరకు రద్దు చేయబడతాయని ప్రకటించాయి. భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలకు ప్రతి స్పందనగా, ఉత్తర పశ్చిమ భారతదేశంలోని 24 విమానాశ్రయాలలో పౌర విమాన కార్యకలాపాలను మే 15 వరకు పొడిగించారు.
మే 15 ఉదయం 05:29 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. చండీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, ధర్మశాల, బటిండాతో సహా ప్రధాన విమానాశ్రయాలను ప్రభావితం చేస్తుంది. ఈ తాత్కాలిక సస్పెన్షన్ ప్రభావంతో ప్రభావితమైన అదనపు విమానాశ్రయాలలో జైసల్మేర్, జోధ్‌పూర్, లేహ్, బికనీర్, పఠాన్‌కోట్, జమ్మూ, జామ్‌నగర్, భుజ్ వంటి వ్యూహాత్మక ప్రదేశాలు ఉన్నాయి.
భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కార్యకలాపాల కోసం మూసివేయబడిన 24 విమానాశ్రయాల జాబితాను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది.
Also Read: హార్పీ.. వెరీ డేంజరస్.. పాక్‌ను చావుదెబ్బ తీసిన డ్రోన్లు.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుక్కుతుక్కు..
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: మూసివేయబడిన విమానాశ్రయాల పూర్తి జాబితా..
ఛండీగఢ్
శ్రీనగర్
అమృత్ సర్
లూథియానా
బుంతర్
కిషన్ ఘర్
పటియాలా
షిమ్లా
బటిండా
జైసల్మేర్
జోధ్ పూర్
బికనీర్
హల్వారా
పటాన్ కోట్
జమ్ము
లేహ్
ముంద్రా
జామ్ నగర్
హిరాసర్
పోర్ బందర్
కేశోడ్
కండ్లా
బుజ్