భవనంలోకి విమానం దూసుకెళ్లింది.. హాస్టల్‌లోని రెండో అంతస్తు నుంచి మా అబ్బాయి దూకేశాడు: గుజరాత్ మహిళ

"అతడికి గాయాలయ్యాయి" అని చెప్పింది.

భవనంలోకి విమానం దూసుకెళ్లింది.. హాస్టల్‌లోని రెండో అంతస్తు నుంచి మా అబ్బాయి దూకేశాడు: గుజరాత్ మహిళ

Updated On : June 12, 2025 / 4:26 PM IST

గుజరాత్‌ అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయలుదేరిన ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.

మేఘనీగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని నివాస ప్రాంతాల్లో ఆ విమానం కూలింది. దీంతో రెండు బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. ఆ భవనాల్లోని పలువురు ప్రాణాలతో బయటపడ్డారు.

Also Read: విమానంలో 169 మంది భారతీయులు.. అత్యధిక మంది మృతి?

ఈ ప్రమాదం గురించి రమీలా అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ… “లంచ్ బ్రేక్ సమయంలో నా కొడుకు హాస్టల్‌కు వెళ్లాడు. విమానం అక్కడకు దూసుకెళ్లింది. నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు. నేను అతనితో మాట్లాడాను. నా కొడుకు హాస్టల్‌ రెండో అంతస్తు నుంచి దూకేశానని చెప్పాడు. అతడికి గాయాలయ్యాయి” అని చెప్పింది.

అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రి వద్ద పూనమ్ పటేల్ అనే యువకుడు మాట్లాడుతూ.. “మా వదిన లండన్‌కు వెళుతోంది. విమాన ప్రమాదం జరిగిందని తెలుసుకుని నేను ఇక్కడకు వచ్చాను” అని తెలిపాడు.

విమాన ప్రమాదంలో గాయాలపాలైన వారిని అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో విమాన ప్రయాణికుల బంధువులు అక్కడకు పెద్ద ఎత్తున వస్తున్నారు.

విమాన ప్రమాదం కారణంగా అక్కడి హాస్టల్‌లోని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ కావడంతో హాస్టల్‌లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు.