Ahmedabad plane crash: విమానంలో 169 మంది భారతీయులు.. అత్యధిక మంది మృతి?

విమానంలో ఫ్యూయల్ నిండుగా ఉంది.

Ahmedabad plane crash: విమానంలో 169 మంది భారతీయులు.. అత్యధిక మంది మృతి?

Updated On : June 12, 2025 / 4:02 PM IST

గుజరాత్‌ అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయలుదేరిన ఏఐ-171 విమానం కూలిపోయింది. దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో అత్యధిక మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

విమాన ప్రమాదం వల్ల అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదం గురించి మాట్లాడారు. అహ్మదాబాద్ కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని చెప్పారు.

రామ్మోహన్‌ నాయుడు ఘటనాస్థలికి బయల్దేరారు. ఈ ప్రమాదంపై డీజీసీఏ స్పందిస్తూ.. ఆ ఫ్లైక్‌కు కెప్టెన్‌గా సుమిత్‌ సబర్వాల్‌ ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ఎల్‌టీసీగా 8,200 గంటల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లు చెప్పింది. కోపైలట్‌కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వివరించింది. విమాన ప్రమాదంపై సమాచారం కోసం హాట్‌లైన్‌ నంబరు 1800 5691 444ను ఏర్పాటు చేశారు.

Also Read: ఇండియాలో డెడ్లీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవే..

విమానంలో విజయ్ రూపానీ
విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న వ్యక్తుల లిస్టులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పేరు ఉంది. ఆయన పేరు మీద బోర్డింగ్ పాస్ ఉంది.

కాగా, విమానంలో ఫ్యూయల్ నిండుగా ఉంది. విమాన ప్రమాదానికి పైలట్ లోపం కారణమా? సాంకేతిక లోపమా? అనేది తర్వాత విచారిస్తారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విమానం టైల్ ఏరియాలో కూర్చున్న వారందరికీ మృతి చెందే ముప్పు ఉంటుంది.