Central Minister Amit Shah: అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? సత్యపాల్ మాలిక్ ఆరోపణలపై స్పందించిన అమిత్ షా
గవర్నర్‌గా ఉన్నప్పుడే ఈ అంశంపై మాట్లాడి ఉండాల్సింది. ఇలాంటి చౌకబారు ఆరోపణలన్నీ బహిరంగ చర్చకు గురికావు అంటూ సత్యపాల్ మాలిక ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

Central Minister Amit Shah
Central Minister Amit Shah: పుల్వామా దాడి సహా జాతీయ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరి, ఇతర విషయాలపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ‘ఇండియా టుడే’ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా మాట్లాడారు.. పదవిని విడిచిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ సత్యపాల్‌కు ఎందుకు గుర్తుకు వస్తున్నాయో నాకు తెలియదు. సత్యపాల్ మాలిక్ మాటలు సరైనవే అయితే, అలాంటప్పుడు గవర్నర్‌గాఉన్న సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ అమిత్ షా ప్రశ్నించారు.
Satya Pal Malik: పుల్వామా దాడిపై సంచలన వ్యాఖ్యలు.. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు
ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడే ఈ అంశంపై మాట్లాడి ఉండాల్సింది. ఇలాంటి చౌకబారు ఆరోపణలన్నీ బహిరంగ చర్చకు గురికావని సత్యపాల్ మాలిక ఆరోపణలపై అమిత్ షా వ్యాఖ్యానించారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల విషయంపై మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజల మద్దతు బీజేపీకి ఉందని, పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పుల్వామా దాడి సహా జాతీయ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరి, ఇతర విషయాలపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, తాజాగా ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
Satya Pal Malik: బీజేపీపై విమర్శలు, కాంగ్రెస్‌పై ప్రశంసలు.. మరింత దూకుడు పెంచిన బీజేపీ సీనియర్ నేత
జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్స్ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై సీబీఐ సమన్లను పంపించింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ విషయాన్ని సత్యపాల్ సైతం ధ్రువీకరించారు. పుల్వామా దాడి ఘటనపై మాలిక్ ఇటీవల కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు రావడం గమనార్హం.