Amitabh Bachchan Rent House: అద్దెకు అమితాబ్ ఇల్లు.. నెలకు రూ.19లక్షలు

ముంబైలోని Vatsa, Ammu బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15ఏళ్ల వరకూ నెలకు రూ.18.9లక్షల చొప్పున అద్దెకు ఇచ్చినట్లు Zapkey.com అనే వెబ్ మీడియా చెప్పుకొచ్చింది.

Amitabh Bachchan Rent House: అద్దెకు అమితాబ్ ఇల్లు.. నెలకు రూ.19లక్షలు

Sbi Rent House

Updated On : October 9, 2021 / 1:43 PM IST

Amitabh Bachchan Rent House: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిని అద్దెకు ఇచ్చారు. ముంబైలోని Vatsa, Ammu బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15ఏళ్ల వరకూ నెలకు రూ.18.9లక్షల చొప్పున అద్దెకు ఇచ్చినట్లు Zapkey.com అనే వెబ్ మీడియా చెప్పుకొచ్చింది.

ఈ లీజు వివరాలను 2021 సెప్టెంబర్ 28న రిజిష్టర్ చేశారు. జల్సాకు పక్కనే ఈ రెండు బంగ్లాలు ఉన్నాయి. మొత్తం 3వేల 150 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు కేటాయించినట్లుగా డాక్యుమెంట్స్ లో ఉంది.

డాక్యుమెంట్ల ప్రకారం.. నెలకు రూ.18.9లక్షలు చెల్లిస్తూనే ఐదేళ్లకోసారి మొత్తం అద్దెలో నుంచి 25శాతం వరకూ పెంచాలని ఉంది. ప్రస్తుతం ఉన్న అద్దె నెలకు రూ.23.6లక్షలు కాగా ఐదేళ్ల తర్వాత 29.5లక్షలుగా ఉంది. దీనికి కోసం ముందుగానే ఏడాది అద్దెను రూ.2.26 కోట్లు డిపాజిట్ చేసినట్లు డాక్యుమెంట్స్ చెబుతున్నాయి.

…………………………………………. : బాలకృష్ణకి గాయం.. అయినా ఆపకుండా షూటింగ్..