Kejriwal: ఆసుపత్రికి వెళ్లి హీరోని కలిశాను అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్

జైలు వెలుపల సత్యేందర్ ను కేజ్రీవాల్ ఏడాది తర్వాత కలవాల్సి వచ్చింది.

Kejriwal: ఆసుపత్రికి వెళ్లి హీరోని కలిశాను అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal, Satyendar Jain

Updated On : May 28, 2023 / 4:25 PM IST

Kejriwal – Satyendar: ఢిల్లీ (Delhi) మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌(58)కు సుప్రీంకోర్టులో (Supreme Court) మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి హవాలా కుంభకోణంలో సత్యేందర్ పాత్ర, ఇతర అవినీతి ఆరోపణలు ఆయనపై ఉన్న విషయం తెలిసిందే.

సత్యేందర్ జైన్ ను ఆసుపత్రిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కలిశారు. సత్యేందర్ జైన్ ను ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేజ్రీవాల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ” ధైర్యవంతుడిని కలిశాను.. ది హీరో ” అని పేర్కొన్నారు. జైలు వెలుపల సత్యేందర్ ను కేజ్రీవాల్ ఏడాది తర్వాత కలవాల్సి వచ్చింది.

కాగా, నగదు అక్రమ చలామణీ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్ ఏడాది పాటు తిహాడ్‌ జైలులో ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆసుపత్రిలో చేరారు. జులై 11 వరకు ఆయనకు బెయిల్ దక్కింది. అనుమతి తీసుకోకుండా ఆయన ఢిల్లీ దాటి వెళ్లడానికి వీల్లేదు.

Satyender Jain : ఆసుపత్రిలో ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ .. ఐసీయూలో చికిత్స