Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్‌డీవో నివేదికలో షాకింగ్ విషయాలు

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు సైతం..

Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్‌డీవో నివేదికలో షాకింగ్ విషయాలు

Ev Veihicls

Updated On : May 23, 2022 / 11:41 AM IST

Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. పది మంది వాహనాలు కొనుగోలు చేస్తే అందులో ఇద్దరు నుంచి ముగ్గురు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపినట్లు గతంలో పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తుండటంతో పాటు ఛార్జింగ్ సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.

electric vehicles: బ్యాటరీ లోపాలతోనే ప్రమాదాలు: కేంద్ర కమిటీ

దేశ వ్యాప్తంగా వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మందగించాయి. అయితే వేసవి కాలం కావడంతో వాహనాల్లో మంటలు వ్యాపిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్యాప్తుకు ఆదేశించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయనే అంశాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Electric Vehicles : షాకింగ్ న్యూస్, ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరుగుతాయా?

అందరూ అనుకుంటున్నట్లు ఎలక్ట్రిక్ వాహనాలు దగ్దం కావడానికి వేసవి కాలం కారణం కాదని, బ్యాటరీలో లోపాల కారణంగానే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరియైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను కంపెనీలు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయని, అందుకే వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని డీఆర్డీవో నివేదికలు స్పష్టం చేశారు. అంతేకాక ఖర్చు తగ్గించుకునేందుకు లో గ్రేడ్ మెటీరియల్ ను ఉద్దేశ పూర్వకంగానే ఉపయోగించడం కూడా ప్రమాదాలకు కారణమని డీఆర్డీవో నివేదిక స్పష్టం చేసింది. మరి కంపెనీల వైఖరి బయటపడటంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.