Bharat Biotech: పిల్లలపై జూన్‌లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు – భారత్ బయోటెక్

భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వకసీ హెడ్ డా. రాచెస్ ఎల్లా మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ (కొవాగ్జిన్)తో జూన్ నుంచి పిల్లలపై ప్రయోగం జరపనున్నాం.

Bharat Biotech: పిల్లలపై జూన్‌లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు – భారత్ బయోటెక్

Bharat Biotech

Updated On : May 24, 2021 / 7:23 AM IST

Bharat Biotech: భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వకసీ హెడ్ డా. రాచెస్ ఎల్లా మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ (కొవాగ్జిన్)తో జూన్ నుంచి పిల్లలపై ప్రయోగం జరపనున్నాం. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ప్రొడక్షన్ ను పెంచి సంవత్సరం చివరి నాటికి 700మిలియన్ డోసులు ప్రొడక్షన్ చేయగలదని భావిస్తున్నాం. కంపెనీని ప్రోత్సహిస్తూ రూ.1500కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు.

మా హార్డ్ వర్క్ కు ఫలితం దక్కి చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నాం. ప్రతి రోజు పని చేసుకుని ఇంటికి వెళ్లిక ఇదే మంచి ఫీలింగ్ తో వెళ్తున్నాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్ లో వేగం పెంచి సంవత్సరం చివరి కల్లా 700మిలియన్ డోసులు అందిస్తాం.

గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అదే ఈ జర్నీలో మమ్మల్ని ఇక్కడ నిలిపింది. ఈ ప్రోత్సాహంతోనే బెంగళూరు, గుజరాత్ లోనూ ప్రొడక్షన్ ను చేపట్టాం’ అని డా. ఎల్లా అంటున్నారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా( డీసీజీఐ) మే 13న 2నుంచి 18ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేయడంపై ఫేజ్ 2, ఫేజ్ 3ట్రయల్స్ చేసుకోవచ్చని అప్రూవల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమన్వయంతో రెడీ చేస్తున్నట్లు భారత్ బయోటెక్ మరోసారి స్పష్టం చేసింది.