బీజేపీలో చేరిన మరో ఆప్ ఎమ్మెల్యే

ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్ దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దేశం,దేశ భద్రత విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజన్ నచ్చి తాను బీజేపీలోచేరినట్లు ఈ సందర్భంగా దేవిందర్ తెలిపారు.పంజాబ్ లో ఆప్ కార్యకర్తలు మహిళలను వేధిస్తున్నారంటూ 2016లో బహిరంగా దేవిందర్ చేసిన కామెంట్స్ కు గాను ఆయనను పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.వారం రోజుల వ్యవధిలో ఆప్ ని వీడి బీజేపీలో చేరిన రెండవ శాసనసభ్యుడిగా దేవిందర్ నిలిచారు. మే-3,2019న ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్ పేయి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే