బికనీర్ ల్యాండ్ స్కామ్ లో ప్రియాంకా : బాంబ్ పేల్చిన స్మృతీ ఇరానీ

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 11:00 AM IST
బికనీర్ ల్యాండ్ స్కామ్ లో ప్రియాంకా : బాంబ్ పేల్చిన స్మృతీ ఇరానీ

బికనీర్ ల్యాండ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం (మార్చి-13,2019) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. గాంధీ కుటుంబం మొత్తం ఏ విధంగా అవినీతికి పాల్పడిందో గడిచిన 24 గంటలుగా న్యూస్ లో వస్తుందని తెలిపారు.
Read Also : నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు
బికనీర్ ల్యాండ్ స్కామ్ డాక్యుమెంట్స్ లో  ప్రియాంకా గాంధీ పేరు కూడా ఉందని స్మృతీ ఇరానీ బాంబ్ పేల్చింది. బికనీర్ ల్యాండ్ స్కామ్ ఓ ఫ్యామిలీ ప్యాకేజీ అని ఆమె ఆరోపించింది. రాబర్ట్ వాద్రాపై కూడా ఈ సందర్భంగా ఆమె విమర్శలు గుప్పించారు. సొంత కుటుంబ వ్యక్తుల కోసమే గాంధీ ఫ్యామిలీ పనిచేస్తుందని తెలిపారు. ఢిఫెన్స్ డిపార్ట్ మెంట్ నుంచి రాఫెల్ ఫైల్స్ మిస్సింగ్ లో ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లు తేలిందని, రాబర్ట్ వాద్రా,సంజయ్ భండారీలు కలిసి లండన్ లో బినామీ పేర్లతో ప్రాపర్టీలు కొనుగోలు చేశారని ఆమె తెలిపారు. వాద్రా, భండారీల సంబంధం బయటపడిందన్నారు.