56అంగులాల ఛాతి గల మోడీ మీద కామెడీ సినిమా తీయొచ్చు

  • Published By: vamsi ,Published On : April 19, 2019 / 05:23 AM IST
56అంగులాల ఛాతి గల మోడీ మీద కామెడీ సినిమా తీయొచ్చు

ఎన్నికలవేళ రాజకీయ నాయకులు ప్రచార హీట్‌ను పెంచేశారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్‌ బీజేపీపైన, ప్రధాని మోడీపైన విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ బయోపిక్‌పై విమర్శలు చేశారు.

ప్రధాని మోడీ ఏం చేశారని ఆయన బయోపిక్ తీశారంటూ ప్రశ్నించారు. ఆయనపై బయోపిక్‌ కంటే ఒక కామెడీ సినిమా తీస్తే సరిగ్గా సరిపోతుందని అన్నారు. అందులో 56అంగులాల ఛాతి ఉన్న వ్యక్తిని ప్రధానిని చేస్తే ఏం చేయలేకపోయారు అనే విషయాన్ని చూపించాలని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఎన్నో హామీలు గుప్పించిన మోడీ.. ప్రధాని అయ్యాక వాటిని తుంగలో తొక్కిన విధానంను, ప్రజలను మోసం చేసిన మోడీ మోసపూరిత చర్యలను చూపించాలని అన్నారు. ఊర్మిళ ముంబై నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు. ఇక మోడీ బయోపిక్ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.