కరోనా భయం : ఆవుపేడతో స్నానం!!

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 04:55 AM IST
కరోనా భయం : ఆవుపేడతో స్నానం!!

Updated On : March 5, 2020 / 4:55 AM IST

ఇలా చేస్తే కరోనా వైరస్ సోకదట..అని ఎవరైనా చెబితే చాలా ప్రజలు దాన్ని ఫాలో అయిపోతున్నారు. అంతగా భయపెట్టేస్తోంది మరి కరోనా. కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే వినూత్నమైన మాస్క్ ల గురించి చూశాం. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆవు పేడతో స్నానం చేసేస్తున్నారు జనం!

ఆవు పేడలో స్నానం చేస్తే కరోనా వైరస్ దరిచేరదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది ఆవు పేడ కోసం పరుగులు పెడుతున్నారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించబడిన దాఖాలు లేవు.  కానీ ఇదిగో పులి అంటూ అదిగో తోక అనే జనాలు మాత్రం ఆవు పేడతో స్నానాలు చేసేస్తున్నారు. 

కరోనా భయం పట్టుకున్న ప్రజలు మాత్రం ఆవుపేడతో స్నానంచేస్తే కరోనా రాదనే మాటలు నమ్మేస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటకలో కొందరు వ్యక్తులు ఓ పేద్ద తొట్టెలో ఆవు పేడ వేసి దాన్ని నీటితో నింపేశారు.తరువాత కొంతమంది ఆ తొట్టెలో దిగి కిందా మీదా పూసుకుంటున్నారు. టబ్ బాత్ చేసేస్తున్నారు. ఇలా ఆవుపేడతో  స్నానం చేయడం వైరల్‌గా మారింది. 

అంతేకాదు ఆవు పేడ సర్వ రోగ నివారణి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. కానీ ఆవుపేడతో స్నానం చేస్తే కరోనా రాదని మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదనే విషయాన్ని గమనించాలి. కాబట్టి.. కరోనా వైరస్ గురించి వస్తున్న పుకార్లు..ఫేక్ వార్తలను నమ్మకండి. వీలైనంత పరిశుభ్రంగా ఉండండి..రద్దీ ప్రాంతాల్లో తిరగకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పటి వరకూ కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవటమే తప్ప దానికి ఎటువంటి మందూ రాలేదు..తస్మాత్ జాగ్రత్త!!

ఆవు పేడ కోసం తెల్లవారు ఝామునే లేచి ఆవులు ఉన్న చోటికి వెళ్లి దొంగతనంగా ఆవుపేడను తెచ్చుకుంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే పుకార్లు ఎంతగా షికార్లు చేస్తున్నాయో ఊహించుకోవచ్చు.

See More :

విశాఖలో కరోనా కలకలం : కుటుంబంలో ముగ్గురికి వైరస్!

ఈ సింపుల్ టిప్‌‌ పాటిస్తే 40% కరోనా సోకదు.. అది మాస్క్ మాత్రం కాదు!

సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడీజీ’ : ఇలాక్కూడా వాడేసుకుంటున్నారు