ఎన్నికలకు వచ్చిన 876కోట్ల డొనేషన్లలో బీజేపీకి వచ్చిందే 698కోట్లు

కార్పొరేట్ కంపెనీలు, బిజినెస్ హౌజెస్ నుంచి ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీలకు DONATION ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే 2018-19 ఫిస్కల్ ఇయర్‌కు వచ్చిన రూ.876కోట్లలో BJPకే పెద్ద మొత్తంలో ముట్టాయట. ఆ తర్వాత కాంగ్రెస్ కు అందాయని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ADR) గురువారం వెల్లడించింది.
BJPకి రూ.698కోట్లు డొనేషన్ రాగా, కాంగ్రెస్ రెండో స్థానంలో అంటే రూ.122.5కోట్ల డొనేషన్ దక్కించుకుందని రిపోర్టులు చెబుతున్నాయి. అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి అందిన అన్ని రాజకీయ పార్టీల డొనేషన్లను లెక్కేస్తే 92శాతం తెలిసిన డొనేషన్లు రూ.876కోట్లు.
‘ఐదు జాతీయ పార్టీలలో బీజేపీకి అత్యధికంగా రూ.698.082కోట్లు డొనేషన్లు వచ్చాయి. వెయ్యి 573మంది కార్పొరేట్ డొనార్లు ముందుకొచ్చారు. కాంగ్రెస్ జాతీయపార్టీకి మాత్రం 122కార్పొరేట్ డొనార్స్ నుంచి రూ.122.5కోట్లు మాత్రమే అందాయి. ఎన్సీపీకి రూ.11.345కోట్లు 17కార్పొరేట్ యాజమాన్యాల నుంచి వచ్చాయి.
జాతీయ పార్టీలకు అందిన రూ.13.57కోట్లకు 34మంది డొనేషన్లలో పాన్ వివరాలు లేవు. లేదా 99.75 శాతం పాన్, అడ్రస్ వివరాలు లేని విరాళాలు రూ.13.365 కోట్లు బీజేపీకి చెందినవే’
‘విరాళాలు ఇచ్చే వారు కనీసం రూ.20వేల నుంచి గరిష్టంగా ఎంత ఇచ్చినప్పటికీ వారి పాన్ కార్డులను నమోదు చేయాల్సిందే. అందిన రూ.13.364కోట్ల విరాళానికి జాతీయ పార్టీలు 274 మంది కార్పొరేట్ డొనార్ల నుంచి పాన్ కార్డులు, అడ్రస్ డిటైల్స్ తీసుకోకుండానే విరాళాలు పుచ్చుకున్నాయి.
నిజానికి అటువంటి అసంపూర్తి కంట్రిబ్యూషన్స్ అన్నింటినీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిటర్న్ చేయాల్సి ఉంది. ఇన్‌కంప్లీట్ ట్రాన్సాక్షన్ అని ఇచ్చేయాల్సి ఉంటుంది.
‘పొలిటికల్ ఫైనాన్సింగ్ అంశంలో కార్పొరేట్స్ వాటి వివరాలను పబ్లిక్ డొమైన్ వెబ్ సైట్లలో పొందుపరిచి ట్రాన్సపరెంట్ గా ఉండాలి. దీని కోసం అన్ని జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు లేని పార్టీలన్నీ అటువంటి చట్ట వ్యతిరేకమైన విరాళాలు లాంటి వాటిని ప్రోత్సహించకుండా అడ్డుకోవాలి’ పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ సూచిస్తుంది.