2024 Election Plan of BJP: 3 రాష్ట్రాల సీఎంలుగా గిరిజన, యాదవ, బ్రాహ్మణ.. 2024 ఎన్నికల ఎజెండాను ఫిక్స్ చేసిన బీజేపీ?
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మోహన్ యాదవ్‌కు మధ్యప్రదేశ్ పగ్గాలు అప్పగించగా, విష్ణు దేవ్ సాయిని చత్తీస్‌గఢ్‌కు అధిపతిని చేశారు. కాగా, మంగళవారం రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను ప్రకటించారు. మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురిని ముఖ్యమంత్రులను చేశారు.
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రాల్లో కుల సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో భాగంగానే బీజేపీ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ.. మహారాణికి మొండిచేయిచ్చిన అధిష్టానం
మోహన్ యాదవ్‌ను ఎందుకు ఎంపిక చేశారు?
ఓబీసీ సమస్యను కాంగ్రెస్ పార్టీ నిరంతరం లేవనెత్తుతోంది. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా కాంగ్రెస్‌కు ఇది సమాధానంలా కనిపిస్తోంది. ఇక దీనితో పాటు ఓబీసీ ఓట్లను రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఓబీసీ ఓటు చాలా ముఖ్యమైంది. ఈ నేపథ్యంలోనే మోహన్ యాదవ్‌ను ముందుకు తెచ్చి, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన గ్రౌండ్ ను సిద్ధం చేసింది.
రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మకు ఎందుకు?
ఇక రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మను ముఖ్యమంత్రిగా మంగళవారం సాయంత్రం బీజేపీ ప్రకటించింది. ఆయన బ్రాహ్మణ సమాజానికి చెందిన నేత. రాష్ట్రంలోని బ్రాహ్మణులే కాకుండా దేశంలోని బ్రాహ్మణ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఇది. గణాంకాల ప్రకారం, రాజస్థాన్‌లో 89 శాతం హిందువుల జనాభా ఉంది. వీరిలో షెడ్యూల్డ్ కులాల జనాభా 18 శాతం కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 13 శాతం. బ్రాహ్మణుల జనాభా దాదాపు ఏడు శాతం. రాష్ట్రంలోని బ్రాహ్మణులు బీజేపీకే మద్దతుగా ఉన్నారు. వారి పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ఎత్తుగడ అని కూడా అంటున్నారు.
ఇది కూడా చదవండి: అలా చేయడం కంటే చచ్చిపోతాను.. సీఎం కుర్చీ జారీపోయిన అనంతరం మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓటర్లపై కన్ను
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గిరిజన ఓటర్లపై పట్టు పెంచుకునేందుకు విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓటర్లే నిర్ణయాత్మకం. ఇక్కడి జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది గిరిజనులే. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 29 స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. ఇది కాకుండా రాష్ట్రంలో 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 4 సీట్లు గిరిజన వర్గానికి రిజర్వ్ చేశారు. ఇదే కాకుండా, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ ఏంటంటే.. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసించే జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి సీఎం ఎలా అవుతారు? రాజ్యాంగంలోని ఈ విషయం ఏం చెప్తుందంటే?